For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multi Cap Funds: ఏమిటిది, ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్!

|

చాలామంది తమ ఆదాయాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే ఫిక్స్డ్ డిపాజిట్(FD)లో ఇన్వెస్ట్ చేస్తారు. రిస్క్ కోరుకోనివారు, అలాగే ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ తమ చేతిలోని మొత్తాన్ని FD చేస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఎక్కువగా మల్టీ క్యాప్ స్కీమ్ వైపు చూస్తారు. గత ఏడాది కాలంలో ఇవి 92 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. పలు మల్టీ క్యాప్ ఫండ్స్ ఏడాదిలో 65 శాతం నుండి 92 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. మూడేళ్ల కాలంలో సగటున 30 శాతం ఇచ్చాయి.

మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్

మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్

- క్వాంట్ యాక్టివ్ ఫండ్ ఏడాదిలో 92.4 శాతం, గత మూడేళ్లలో సగటున ఏడాదికి 35.8 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

- మహీంద్రా మనులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 78.9 శాతం, గత మూడేళ్లలో సగటున ఏడాదికి 31.7 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

- ఇన్వెస్కో ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 69.0 శాతం, గత మూడేళ్లలో సగటున ఏడాదికి 24.6 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

- బరోడా మల్టీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 68.8 శాతం, గత మూడేళ్లలో సగటున ఏడాదికి 24.4 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

- ప్రిన్సిపల్ మల్టీ క్యాప్ గ్రోత్ ఫండ్ ఏడాదిలో 64.9 శాతం, గత మూడేళ్లలో సగటున ఏడాదికి 22.5 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే

మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే

లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి మల్టీ క్యాప్ ఫండ్స్. ఈ మూడు కేటగిరీల్లోను రిస్క్, అవకాశాలు ఉంటాయి. సెబి నిబంధనల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్ ఆ తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్ ఉంటాయి.

పెట్టుబడి నిబంధనలు

పెట్టుబడి నిబంధనలు

పెట్టుబడి నిబంధనలు

తక్కువ రిస్క్ రావాలనుకుంటే

తక్కువ రిస్క్ రావాలనుకుంటే

ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తూనే, అధిక రిస్క్ తీసుకోవడం ఇష్టంలేని వారు టాప్ రేటెడ్ మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఫండ్స్‌ను డైవర్సిఫై చేస్తాయి. మార్కెట్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ స్మాల్, మిడ్ క్యాప్స్ కంటే తక్కవ రిటర్న్స్ ఇస్తాయి. కానీ వొలాటైల్ మార్కెట్ కండిషన్‌లో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం 12 నెలల లోపు పెట్టుబడిపై 15 శాతం లెవీ ఉంది. 12 నెలలు దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటలై గెయిన్స్‌గా భావిస్తారు. అప్పుడు 10 శాతం ఉంటుంది.

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడినది. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది.

English summary

Multi Cap Funds: ఏమిటిది, ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్! | Fixed Deposit Vs Multi Cap Funds Investment Returns

If you want more returns than FD with less risk then you can invest in multi cap funds.
Story first published: Friday, November 12, 2021, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X