Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారు కొద్ది రోజులు ఆగితే బెటర్..!
ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారు కొంత ఆగాలా లేక ఇప్పుడే చేయాలా అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అక్టోబర్ లో రెపో రేట్ ను పెంచింది. దీంతో పలు బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు డిసెంబర్ లో జరగబోయే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ లో రెపో రేటు పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను ఓసారి చూద్దాం. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్ల డిపాజిట్‌పై 8.25 శాతం అత్యధిక రేటును అందిస్తోంది. అనేక ఇతర బ్యాంకులు 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేట్లను అందిస్తున్నాయి. అయితే అత్యధిక రాబడులు తరచుగా నిర్దిష్ట డిపాజిట్ కాలపరిమితులతో ముడిపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.10 శాతం వడ్డీ అందిస్తోంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం వడ్డీరేట్లు అందిస్తున్నాయి. డీసీబీ బ్యాంక్ 7.75 శాతం ఆఫర్ చేస్తుండగా.. ఎస్బిఎం బ్యాంక్ ఇండియా 7.65 శాతం వరకు వడ్డీ టెల్లిస్తోంది. బంధన్ బ్యాంక్ 7.45 శాతం వరకు అందిస్తుండగా.. సిటీ యూనియన్ బ్యాంక్ 7.30 శాతం వరకు అందిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, యెస్ బ్యాంక్ 7.25 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 శాతం వరకు అందిస్తుండగా.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ 6.90 శాతం వరకు అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఇండియన్ బ్యాంక్ 6.80 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. కెనరా బ్యాంక్ 6.75 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. పెట్టుబడిదారులు కేవలం ప్రకటించిన వడ్డీ రేటు ఆధారంగా మాత్రమే ఎఫ్‌డిని ఎంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కాలపరిమితి, గడువుకు ముందే ఉపసంహరించుకుంటే విధించే జరిమానా, వడ్డీ ఆదాయంపై పన్ను వంటివి వాస్తవ రాబడులను ప్రభావితం చేయగలవని గుర్తుంచుకోవాలి.
డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) పరిధిలోకి వచ్చే బ్యాంకులలోని డిపాజిట్లకు, వర్తించే నిబంధనలకు లోబడి, అసలు, వడ్డీతో సహా, ప్రతి డిపాజిటర్‌కు, ప్రతి బ్యాంకుకు రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications