Personal Laon: తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు ఇస్తున్న ప్రైవేట్ బ్యాంకులు ఇవే..!

ఈ రోజులు అప్పులు తీసుకోవడం కామన్ గా మారింది. అయితే బయట అప్పులు తీసుకుంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. అందుకే చాలా మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. అయితే ఇది అన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఏమిటో తెలుకుందాం. పైసాబజార్ ప్రకారం సెప్టెంబర్ నాటికి ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.90% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐదేళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల వ్యక్తిగత రుణానికి నెలవారీ EMI సుమారు రూ.10,355 నుంచి ప్రారంభమవుతుంది.

యాక్సెస్ బ్యాంక్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 8.9 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఇందులో లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీ లోన్ అమౌంట్ లో 2 శాతం ఉంటుంది. రూ.లక్ష తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీ రూ.2 వేలు ఉంటుంది. రూ.5 లక్షలు తీసుకుంటే రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీ కట్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ పర్సనల్ లోన్లపై 11.75 నుంచి 18.99 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ 3 శాతంగా ఉంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో పర్సనల్ లోన్ కు 9.99 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ రూ.6500 వరకు ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో పర్సనల్ లోన్ పై 9.99 శాతం వడ్డీ రేటు ఉంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ 2 శాతం వరకు ఉంటుంది.

Personal Loan

కోటక్ మహీంద్ర బ్యాంకులో పర్సనల్ లోన్ పై 10.99 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ 5 శాతం వరకు ఉంది. ప్రకటించిన అత్యల్ప వడ్డీ రేటు ప్రతి రుణగ్రహీతకు లభిస్తుందని హామీ ఇవ్వదు. బ్యాంకింగ్ సంస్థలు వ్యక్తిగత క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఉద్యోగ చరిత్ర, తిరిగి చెల్లింపు చరిత్రతో సహా అనేక అంశాల ఆధారంగా తుది వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.
ఉదాహరణకు ఐదేళ్ల కాలానికి 8.90% వడ్డీ రేటుతో తీసుకున్న రూ.5 లక్షల రుణానికి, EMI సుమారుగా రూ.10,355 ఉంటుంది. అదే రుణాన్ని 15 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే నెలకు దాదాపు రూ.11,895 చెల్లించాల్సి ఉంటుంది.

అధిక వడ్డీ రేటు మొత్తం రుణ కాలంలో తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి, సాధ్యమైనంత ఉత్తమమైన వ్యక్తిగత రుణ వడ్డీ రేటు నిబంధనలను పొందడానికి, రుణగ్రహీతలు రుణ సంస్థను ఎంచుకునే ముందు, వారు అందించే తుది వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, వర్తించే పన్నులు, ఫోర్‌క్లోజర్ ఛార్జీలను పోల్చి చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ముందస్తు ఖర్చులను తగ్గించగలదు, అదేవిధంగా తక్కువ వడ్డీ రేటు మొత్తం తిరిగి చెల్లించే భారాన్ని తగ్గించగలదని వివరిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+