మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి" అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్‌లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు "ఇప్పుడే నేర్పడం అవసరమా?" అంటూ పిల్లల పేర మీదే తామే సేవ్ చేస్తారు. కానీ ఇలా చేస్తే పిల్లలు డబ్బు విలువ, సేవింగ్ అలవాటు నేర్చుకునే అవకాశం దొరకదు. చిన్నప్పుడే అలవాటు చేస్తే, పెద్దయ్యాక ఫైనాన్షియల్‌గా స్మార్ట్‌గా మారడం చాలా ఈజీ అవుతుంది.
ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దానిని సేవ్ చేయకండి... సేవ్ చేసిన తర్వాత మిగిలిన దానిని మాత్రమే ఖర్చు చేయండి" వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాటలు డబ్బు సేవ్ చేయడంలో ఉన్న అసలు తత్వాన్ని అద్భుతంగా చెబుతాయి. ముందుగా సేవ్ చేయడం, తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అలవాటు. ఈ అలవాటు చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచితే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా నిలబడగలరు. పెద్దయ్యాక వారికి డబ్బు ఎలా మేనేజ్ చేయాలో మీరు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉండదు వారు చిన్నప్పటి నుంచే తెలివిగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక పిల్లలకు చిన్న వయసులోనే డబ్బు సేవ్ చేయడం నేర్పించే కొన్ని సులభమైన, ఆసక్తికరమైన మార్గాలు చూద్దాం.

1. పిల్లలకు "డబ్బు అంటే కష్టపడి సంపాదించేది" అనే భావన రావాలంటే చిన్న చిన్న పనులకీ చిన్న భత్యం లాగా ఇవ్వండి. ఉదాహరణకి నీళ్ల బాటిళ్లు నింపడం, బట్టలు మడతపెట్టడం, గది సర్దుకోవడం వంటి పనులు చేస్తే వారికి కొద్దిగా డబ్బు ఇవ్వండి. ఇలా చేస్తే వాళ్లు డబ్బు విలువ, శ్రమ విలువ రెండూ అర్థం చేసుకుంటారు.
2. గార్డెనింగ్ అంటే చాలా సులభమైన డబ్బుల గురించి నేర్పించే మార్గం. పిల్లలతో కలిసి విత్తనాలు నాటండి, వాటికి రోజూ నీళ్లు పోయించండి. మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి, డబ్బూ ఒక్కసారిగా పెరుగదు. మనం క్రమంగా, సమయంతో, సహనంతో డబ్బును పెంచాలి అని వారికీ వివరించవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు చిన్న వయసులోనే పెట్టుబడి, రాబడిని అర్థం చేసుకుంటారు.
3. పిగ్గీ బ్యాంక్ పిల్లలకు ఒక ఉత్సాహం. వాళ్లు తమ పాకెట్ మనీని లేదా బహుమతిగా వచ్చిన డబ్బుని అందులో వేస్తూ ఉంటారు. తర్వాత ఒక ప్రత్యేకమైన వస్తువు కొనడానికి ఆ డబ్బును వాడడం వాళ్లకు ఓ పెద్ద ఆనందం ఇస్తుంది. దీని ద్వారా వాళ్లలో సహనం, క్రమశిక్షణ మరియు "సేవ్ చేస్తే ఫలితం దొరుకుతుంది" అనే భావన పెరుగుతుంది.
4. పిల్లలను సీరియస్ ఫైనాన్షియల్ మీటింగ్స్‌లో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు కానీ... లైట్‌గా జరిగే మనీ టాపిక్స్‌లో వారిని చేర్చడం చాలా ఉపయోగకరం. ఉదాహరణకి, ట్రిప్ బడ్జెట్ గురించి మాట్లాడడం, కరెంట్ సేవ్ చేయడం వంటి విషయాల్లో వారిని కూడా భాగస్వామ్యం చేయండి. ఇలా చేయడం వాళ్లకు డబ్బు విలువ, ప్లానింగ్ ప్రాధాన్యత సింపుల్‌గా అర్థమవుతుంది.
5. పిల్లలు పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. మీరు డబ్బు సేవ్ చేసే మంచి అలవాట్లు చూపిస్తే, వారికీ అదే స్పూర్తి వస్తుంది. ఉదాహరణకి అనవసరమైన ఖర్చులు తగ్గించడం, రెగ్యులర్ గా సేవింగ్స్‌కి డబ్బు పెట్టడం వంటి విషయాలు ప్రాక్టికల్‌గా చూపించండి. మాటలకన్నా, మీ చర్యలు వారికి పెద్ద క్లాస్ అవుతాయి.
6. పిల్లల కోసం సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ తెరవండి. అందులోకి డబ్బు పెట్టడం, ఆ డబ్బు వడ్డీ, రాబడి పెరుగుతుందని వారికే సులభంగా చెప్పండి. FD సురక్షితంగా ఉంటుంది, మరియు ఖచ్చితంగా కొంత రాబడిని ఇస్తుంది. దీర్ఘకాల సేవింగ్స్ కోసం బాగుంటుంది.
పిల్లలకు సేవింగ్ అలవాటు నేర్పడమే కాకుండా, వారి ఉన్నత విద్య లేదా భవిష్యత్తు ఖర్చులు కోసం ముందుగానే ప్లాన్ చేయడం కూడా ముఖ్యం. ఇలా చేస్తే వాళ్లకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు, మరియు మీరు కూడా నిశ్చింతగా ఉంటారు. ఈక్విటీ SIP అనేది షేర్లలో చిన్న చిన్న మొత్తాలతో క్రమంగా ఇన్వెస్ట్ చేసే సిస్టమ్. రూ. 100 తోనే ప్రారంభించవచ్చు. పిల్లల పేరుతో SIPలు ప్రారంభించడం వాళ్ల భవిష్యత్తు సంపద నిర్మాణంకి మంచి మార్గం అవుతుంది. ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత మంచి రాబడులు వస్తాయి.
డబ్బు సేవ్ చేయడం, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం అనేది పుస్తకాల్లో నేర్చుకునేది కాదు. జీవితంలో చిన్న వయసులోనే అలవాటుగా చేసుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి పిల్లల కోసం మీరు ఒకరు మాత్రమే ప్లాన్ చేయకుండా, వారికీ "సేవింగ్ ఆర్ట్" నేర్పించడం మొదలు పెట్టండి. ఇది వారికి జీవితాంతం ఉపయోగపడే విలువైన గుణం అవుతుంది.
More From GoodReturns

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications