డబ్బు విషయంలో మన చిన్నప్పుడు ఇంట్లో విన్న మాటలు, నమ్మిన అలవాట్లే ఇప్పటికీ మనల్ని అడ్డుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు! మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక అలవాట్లు (Financial Habits) అనేవి కేవలం పొదుపు, భద్రత చుట్టూనే తిరుగుతాయి. కానీ, మారుతున్న ద్రవ్యోల్బణం, కొత్త పెట్టుబడి అవకాశాల నేపథ్యంలో, పాత నమ్మకాలతో ముందుకు వెళ్తే లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

FDలు సేఫ్, అప్పులు చెడ్డవి, స్టాక్ మార్కెట్ జూదం - ఇవే కదా మనం వింటూ పెరిగాం? కానీ, ఈ పాత ఆర్థిక అలవాట్లు మన డబ్బును పెంచకుండా ఆపేస్తున్నాయని, వాటిని వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు మార్చుకోవాల్సిన కొన్ని నమ్మకాలు ఏంటంటే..
1. FDలు మాత్రమే సేఫ్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అంటేనే భద్రత. మన డబ్బు ఎక్కడికీ పోదు అని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమే అయినప్పటికీ.. ద్రవ్యోల్బణం (Inflation) 6-7% ఉన్నప్పుడు, FDల నుంచి వచ్చే రాబడి కూడా అంతే ఉంటుంది. అంటే మీ డబ్బు సంఖ్యాపరంగా పెరుగుతున్నా, దాని కొనుగోలు శక్తి పెరగడం లేదు. కేవలం భద్రతపైనే దృష్టి పెట్టి, గ్రోత్‌ను పట్టించుకోకపోవడం ఈ రోజుల్లో పెద్ద రిస్క్. కనీసం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఇచ్చే పెట్టుబడి సాధనాలవైపు చూడాలి.
2. అప్పు తీసుకోవడం చాలా చెడ్డ పని..
అప్పు తీసుకోవడం ప్రమాదకరం, వడ్డీ కట్టడం దండగ. అప్పులు లేకుండా బతకాలి అని చాలామంది నమ్ముతుంటారు. ఇది నిజమే అయినప్పటికీ.. అన్ని లోన్లు చెడ్డవి కావు. తెలివిగా తీసుకునే లోన్లు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ఇల్లు కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ లేదా చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం అనేది సరైన నిర్ణయం. సరైన ప్లాన్ లేకుండా, అధిక వడ్డీతో తీసుకునే (ఉదా: క్రెడిట్ కార్డుపై EMI) లోన్లే సమస్య. గుడ్ లోన్, బ్యాడ్ లోన్ తేడా తెలుసుకోవడం నేటి ఆర్థిక అలవాట్లలో ముఖ్యం.
3. స్టాక్ మార్కెట్ అంటే జూదమే..
స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టడం ప్రమాదం అని, టిప్స్ విని చాలా మంది డబ్బు కోల్పోతారు కాబట్టి ఇది జూదం అని చాలామంది భావిస్తుంటారు. అయితే ప్లాన్ లేకుండా, ఇతరుల సలహాలతో పెట్టే పెట్టుబడి జూదమే. కానీ క్రమశిక్షణతో, దీర్ఘకాలిక లక్ష్యంతో, డేటా ఆధారంగా చేసే పెట్టుబడి సంపద సృష్టిస్తుంది. రెగ్యులర్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ల ద్వారా మార్కెట్ రిస్క్‌ను తగ్గించి, కాలక్రమంలో స్థిరమైన రాబడిని పొందవచ్చు.
4. ఇన్సూరెన్స్ అంటేనే ఇన్వెస్ట్‌మెంట్..
ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీలు (Money Back Policies) తీసుకుంటే రక్షణతో పాటు డబ్బు కూడా పెరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. అయితే ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇన్వెస్ట్ మెంట్ కాదు. కేవలం రక్షణ మాత్రమే. ఈ పాలసీల నుంచి వచ్చే రాబడి (4-5%) చాలా తక్కువ. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని పొంది, మిగిలిన డబ్బును మంచి మ్యూచువల్ ఫండ్లలో పెడితే, మీకు రక్షణతో పాటు మెరుగైన రాబడి కూడా దొరుకుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ను, ఇన్సూరెన్స్‌ను వేరుగా చూడాలి.
5. తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చులే..
మొదట పెళ్లి, ఇల్లు, పిల్లల చదువు చూసుకుందాం. రిటైర్‌మెంట్ సంగతి తర్వాత చూద్దాం. అని చాలామంది ఇన్వెస్ట్ మెంట్ ను వాయిదా వేస్తుంటారు. అయితే డబ్బు విషయంలో సమయమే పెట్టుబడి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ) లాభాలన్ని అనుభవించాలంటే పెట్టుబడి తొందరగా మొదలుపెట్టాలి. ఉదాహరణకు.. 25 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే.. 35 ఏళ్ల వయసులో రూ.10,000 పెట్టడం కంటే ఎక్కువ సంపద సృష్టించవచ్చు.
మొత్తంగా పాత ఆర్థిక అలవాట్లు మంచి ఉద్దేశంతోనే మనకు నేర్పబడి ఉండవచ్చు. కానీ, మారుతున్న ఆర్థిక ప్రపంచంలో మనం ఈ అలవాట్లను సమీక్షించుకోవాలి, అవసరమైతే వాటిని వదిలించుకోవాలి. సరైన సమాచారం, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల ద్వారానే మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందగలరు అని గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications