భారత దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీరేటును పదేళ్ల కనిష్టానికి తగ్గించాయి. దీనికి తోడు హోమ్ బిల్డర్స్ ఇళ్లను, ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా రియాల్టీ దిగ్గజం కుదేలయింది. గత కొద్ది రోజులుగా కోలుకుంటోంది. ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకొని, డిమాండ్‌ను పెంపొందించేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో చాలామంది ఇప్పుడు హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్‌తో పాటు పెట్టుబడుల దిశగా ఆలోచన చేస్తున్నారు. విచ్చలవిడి ఖర్చును పక్కన పెట్టేసి, ఏదో రూపంలో దాచుకునేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో సొంతిళ్లకు డిమాండ్ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నందున విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డిమాండ్‌ను మరింత పెంచేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ ప్రత్యేక వడ్డీ రేటు తగ్గింపు, ఆఫర్లు ఇస్తున్నారు.

సురక్షిత రుణ కేటగిరీ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పండుగ సందర్భంగా వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాయి. దీంతో ప్రారంభ వడ్డీ రేటు ఏకంగా 6.5 శాతం నుండి 6.7 శాతం స్థాయికి పడిపోయింది. ఇది దశాబ్ద కాలంలో కనిష్ట వడ్డీ రేటు. కరోనా కారణంగా బ్యాంకుల బ్యాడ్ లోన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు సెక్యూర్డ్ రుణాల కేటగిరీని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్బీఐ పెద్ద మొత్తంలో నగదును ఇండక్ట్ చేసిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి.

ఆకర్షణీయ వడ్డీ రేటు, డిస్కౌంట్
ఓ వైపు పండుగ సమయంలో బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించగా, మరోవైపు బిల్డర్స్ ఇళ్లు, ఫ్లాట్స్ పైన ఆకర్షణీయ డిస్కౌంట్ ఇస్తున్నారు. రియాల్టీ నుండి ఆటో రంగం వరకు వివిధ కంపెనీలు పండుగ సమయంలో ఆఫర్లు ఇస్తున్నాయి. వాల్ మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అమెజాన్ కూడా ఆఫర్లను ప్రకటించింది.
ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు సేల్స్ లేకపోవడంతో హోమ్ బిల్డర్స్ కూడా ప్రత్యేక డిస్కౌంట్స్ అమలు చేస్తున్నారు. 'వడ్డీ రేట్లు తగ్గడం, పండుగ సమయంలో ఇళ్ల పైన డిస్కౌంట్ వంటి అంశాలు డిమాండ్‌ను పెంచేవేనని' ప్రాపర్టీ రీసెర్చ్ కంపెనీ జాన్స్ లాంగ్ లాసాల్ ఇంక్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ హెడ్ శమంతక్ దాస్ అన్నారు.

ఇల్లు కొనుగోలు చేస్తామని..
వచ్చే మూడు నెలల కాలంలో ఇంటిని కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నారని జేఎల్ఎల్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న 2500 మందిలో 80 శాతం కంటే ఎక్కువమంది వచ్చే మూడు నెలల కాలంలో ఇల్లును ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జేఎల్ఎల్ సర్వే నిర్వహించింది. పండుగ సమయంలో ఆఫర్లు 30 శాతం నుండి 35 శాతం డిమాండ్ పెరగడానికి దోహదపడుతుందని వెల్లడించింది.
More From GoodReturns

Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications