క్రెడిట్ కార్డ్ అనేది రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్ కార్డును బాధ్యతారాహిత్యంగా ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. మన తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చును చేయాలి. ఇష్టారీతిన, ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తే మీ కార్డు బిల్లు చెల్లింపులు కోల్పోవడం లేదా కనీస మొత్తం మాత్రమే చెల్లింపు వంటివి చేయడం జరుగుతుంది. అప్పుడు మీ క్రెడిట్ కార్డు రుణం పోగుపడుతుంది.
జరిమానాలు కూడా పడవచ్చు. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా తాజా ట్రాన్సాక్షన్స్‌తో పాటు బకాయి పైన కూడా 40 శాతం భారీ జరిమానా పడుతుంది. మీరు మీ బకాయిని, పెనాల్టీని చెల్లించే వరకు ఛార్జీలు వర్తిస్తాయి.

క్రెడిట్ కార్డు వినియోగం
బాధ్యతారాహిత్య క్రెడిట్ కార్డు వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో రుణం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ కార్డు చెల్లింపులు సరిగ్గా లేకుంటే భవిష్యత్తులో మీరు సొంతింటిని కొనుగోలు చేయాలనుకునే మీ జీవిత లక్ష్యాన్ని కూడా నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. పేలవమైన క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డును ప్రణాళికాబద్దంగా వినియోగించడం అవసరం. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయబడితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి మీకు పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి.

ఈఎంఐలోకి మార్చుకోండి
చాలా క్రెడిట్ కార్డు ఇష్యూయర్స్ మీ పెండింగ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తారు. అప్పుడు మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి ఎక్కువ కాలం సమయం తీసుకొని వాటిని చెల్లించవచ్చు. అంటే క్రెడిట్ కార్డు బకాయి మొత్తాన్ని చిన్న చిన్న ఈఎంఐ మొత్తాలుగా చెల్లించవచ్చు.అయితే ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ బకాయి మొత్తాన్ని ఈఎంఐగా మార్చడానికి బ్యాంకులు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అది కూడా మీ ఈఎంఐలలో భాగం అవుతుంది. మీరు క్రెడిట్ కార్డు చెల్లించకపోవడం వల్ల పడే ఛార్జీ కంటే ఈఎంఐ ద్వారా తక్కువ అవుతుంది.
పైగా నెలకు కొంత చెల్లించే వెసులుబాటు ఉంటుంది.ఈఎంఐ ద్వారా బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు మీరు ఎంచుకున్న కాలవ్యవధి ప్రకారం వడ్డీ రేటు మారవచ్చు. మీ వడ్డీ ఔట్-గోను తగ్గించేందుకు మీ రీపేమెంట్ కెపాసిటీకి అనుగుణంగా సాధ్యమైనంత తక్కువ వ్యవధి ఉండేలా చూసుకోండి.

బ్యాలెన్స్ ట్రాన్సుఫర్
మీ బ్యాలెన్స్ మొత్తాన్ని మరో బ్యాంకు లేదా క్రెడిట్ ఇష్యూయర్‌కు జారీ చేసే క్రెడిట్ కార్డుకు బదలీ చేసుకోవచ్చు. అప్పుడు బకాయి పైన తక్కువ వడ్డీ పడుతుంది. కొన్నిసార్లు క్రెడిట్ కార్డు జారీచేసేవారు బ్యాలెన్స్ బదలీపై టీజర్ రేటును కూడా అందిస్తారు. అందులో మీరు నిర్దిష్ట కాలానికి కనీస వడ్డీ రేటును చెల్లించాలి. మీరు ఈ వ్యవధిలోపు మీ మొత్తం క్రెడిట్‌ను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో మీ బ్యాలెన్స్‌ను బదలీ చేయడం ప్రయోజనకరం. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. బ్యాలెన్స్ బదలీకి ముందు మీరు కొత్త క్రెడిట్ కార్డుతో అనుసంధానించబడిన ఫీజులు, ఛార్జీలను తనిఖీ చేసుకోవాలి.

వడ్డీ రేటు
మీ క్రెడిట్ కార్డు బకాయిలు తీర్చడానికి ఉన్న మరో మార్గం పర్సనల్ లోన్ తీసుకోవడం. క్రెడిట్ కార్డు రుణం ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్ సహాయపడుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు ప్రొవైడర్లు 40 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తారు. అయితే పర్సనల్ లోన్ తీసుకుంటే గరిష్టంగా 11 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.
పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారు తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం పొందడానికి అర్హులు కాదు. అర్హత ఉన్నవారు అయితే క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపకుండా ఉండేందుకు పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఇలా క్రెడిట్ కార్డు రుణాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. అప్పుడు అప్పుల ఊబిలో పడకుండా జాగ్రత్తపడవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications