Fixed Deposits: సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఫెడరల్ బ్యాంక్..!

ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు టర్మ్ డిపాజిట్లపై అందించే అదనపు వడ్డీ రేటు ప్రయోజనాన్ని 0.50 శాతం నుంచి 0.60 శాతానికి పెంచింది. ఈ సవరణ తరువాత సీనియర్ సిటిజన్లు ఎంపిక చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కాలపరిమితులపై సంవత్సరానికి 7.50 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు 18 నెలలు, రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు డిపాజిట్ కాలపరిమితులకు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటించింది. సవరించిన రేట్లు రూ.3 కోట్ల లోపు సింగిల్ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.

ముందస్తు ఉపసంహరణ సౌకర్యం ఉన్న డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ పొందవచ్చు. ముందస్తు ఉపసంహరణ సౌకర్యం లేని రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై ఈ రేటు 7.50 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు, సాధారణ డిపాజిటర్ల కోసం సవరించిన ఫెడరల్ బ్యాంక్ FD రేట్లు పరిశీలిస్తే.. ముందస్తు ఉపసంహరణ సౌకర్యం ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఫెడరల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 35 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇది 8.18% వరకు ఉంది. సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు వడ్డీని 0.50% నుండచి 0.60%కి పెంచాలన్న బ్యాంకు నిర్ణయం నేపథ్యంలో ఈ సవరించిన ప్రయోజనం అమలులోకి వచ్చింది.

FD

ఈ రేట్లు నిర్దిష్ట కాలపరిమితులకు, రూ.3 కోట్ల లోపు అర్హత గల డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇదే డిపాజిట్ కాలపరిమితులకు, ముందస్తు ఉపసంహరణ సౌకర్యం ఉన్న టర్మ్ డిపాజిట్లపై ప్రవాస భారతీయులతో (NRIలు) సహా సాధారణ కస్టమర్లు సంవత్సరానికి 6.80 శాతంగా ఉంది. ముందస్తు ఉపసంహరణ సౌకర్యం లేని డిపాజిట్లపై బ్యాంకు సంవత్సరానికి 6.90% వడ్డీ రేటును అందిస్తోంది. కస్టమర్లు ఈ టర్మ్ డిపాజిట్లను ఫెడరల్ బ్యాంక్ శాఖల ద్వారా లేదా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ తన రిటైల్ FD వడ్డీ రేట్లను నవంబర్ 4, 2026 నుంచి అమలులోకి వచ్చేలా సవరించింది.

సాధారణ డిపాజిటర్లు సంవత్సరానికి 6.60 శాతం వరకు, సీనియర్ సిటిజన్లు ఎంపిక చేసిన డిపాజిట్ కాలపరిమితులపై 7.20 శాతం వరకు సంపాదించవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అక్టోబర్ 2026లో రూ.3 కోట్ల లోపు ఎంపిక చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ డిపాజిటర్లు సంవత్సరానికి 6.60 శాతం వరకు, సీనియర్ సిటిజన్లు అర్హత గల డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
బ్యాంక్ ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన రేట్లు రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లకు వర్తిస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+