సురక్షిత పెట్టుబడికి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వీరికి 25 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటు కూడా వర్తిస్తుంది. ఏడు రోజుల నుండి పది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ప్రస్తుతం ఎస్బీఐ, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. సాధారణ FDల కంటే సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి కాలంలో ఎస్బీఐ, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ఆఫర్ చేశాయి. ఈ స్కీమ్స్ కింద ఆకర్షణీయ వడ్డీ రేట్లను ఆఫర్ చేశాయి. అయితే రెండు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ గడువు త్వరలో ముగియనుంది. మార్చి 31, 2022 వరకు మాత్రమే సమయం ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్కీమ్
అంటే ఈ రెండు పెద్ద బ్యాంకుల్లో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి ఆకర్షణీయ వడ్డీ రేటు పొందడానికి మరో వారం మాత్రమే గడువు ఉంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంకు ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా రెసిడెన్షియల్ సీనియర్ సిటిజన్స్‌కు యూనిక్ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు రూ.2 కోట్ల లోపు FD పైన ఏడేళ్ల నుండి 3 సంవత్సరాల కాలపరిమితిపై 0.50 శాతం అదనపు వడ్డీ రేటును, మూడేళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై 0.65 శాతం అదనపు వడ్డీ రేటును, 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 1 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై అదనపు 1 శాతం వడ్డీ రేటు స్కీమ్ మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది.

HDFC వడ్డీ రేటు
HDFC బ్యాంకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద అదనంగా 0.75 శాతం వడ్డీ రేటు ఉంది. అరవై ఏళ్లకు పైన కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు ఈ ప్రత్యేక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ బ్యాంకు ఈ ప్రత్యేక FD స్కీంను మే 18, 2020లో లాంచ్ చేసింది. ఇది మార్చి 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఐసీఐసీఐ, ఎస్బీఐ కూడా
ఐసీఐసీఐ, ఎస్బీఐ కూడా స్పెషల్ డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకు వచ్చాయి.
ఎస్బీఐ వీకేర్ పేరుతో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని మే 2020లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఇచ్చే వడ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీని ఆఫర్ చేస్తుంది. సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. ఎస్బీఐ వీకేర్ ప్లాన్ సెప్టెంబర్ 30, 2022 వరకు అందుబాటులో ఉండనుంది.
ఐసీఐసీఐ సీనియర్ సిటిజన్స్ కోసం ఐసీఐసీఐ బ్యాంకు, గోల్డెన్ ఇయర్స్ పేరుతో ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం మే 20, 2020 నుండి ఏప్రిల్ 8, 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications