న్యూఢిల్లీ: వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల(FD)పై 7 శాతం నుండి 7.5 శాతం మేర వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ కస్టమర్లకు, అలాగే సీనియర్ సిటిజన్లకు ఎంపిక చేసిన అన్ని మెచ్యూరిటీ కాలపరిమితిలకు గాను టర్మ్ డిపాజిట్లపై లాభదాయకమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లతో పాటు చాలామంది బ్యాంకులలో డిపాజిట్ చేసిన (ఫిక్స్డ్ డిపాజిట్లు) వడ్డీ పైన ఆధారపడుతుంటారు. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఎక్కువ వడ్డీ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతారు. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 2.5 శాతం నుండి 7.25 శాతం వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు 3 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ బ్యాంకు 3 ఏళ్ల కాలపరిమితి నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై గరిష్టంగా ఇస్తోంది. ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ కస్టమర్లకు, సీనియర్ సిటిజన్లకు, 7.25 శాతం నుండి 7.75 శాతం మధ్య ఉంటుంది. ఏడాది నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై, అలాగే 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలపరిమితిపై 7 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుడి 10 ఏళ్ల కాలపరిమితిపై 3 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తోంది. ఈ బ్యాంకు 730 రోజుల నుండి 1095 రోజుల కాలపరిమితిపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కాలపరిమితిపై 7.5 శాతం నుండి 8 శాతం వడ్డీ అందిస్తోంది. 365 రోజుల నుండి 729 రోజుల కాలపరిమితిపై 7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 4 శాతం నుండి 7.5 శాతం వరకు అందిస్తోంది. 5 ఏళ్ల కాలపరిమతిపై అత్యధికంగా 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం నుండి 8 శాతం వడ్డీరేటు అందిస్తోంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 3 శాతం నుండి 7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుండి సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వరకు అందిస్తోంది. ఈ బ్యాంకు 700 రోజుల కాలపరిమితిపై అత్యధిక వడ్డీ రేటును 7.5 శాతం అందిస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications