సేఫ్ గా పెట్టుబడి పెట్టే విధానాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD) అన్నింటికంటే ముందు ఉంటాయి. వీటిలో డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా లాంగ్ టర్మ్ లో మంచి రాబడి కూడా ఇస్తాయి. అయితే మీరు పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఒకసారి గమనించడం ముఖ్యం. ఎందుకంటే..
చిన్న తేడా.. పెద్ద లాభం!
సాధారణంగా బ్యాంకుల వడ్డీ రేట్లు ఒకే పరిధిలో ఉంటాయి. అయినా కేవలం 0.50% తేడా కూడా మీ రాబడిని భారీగా పెంచుతుంది. మీరు ఎక్కువ మొత్తం, ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టినప్పుడు ఈ చిన్న తేడా వల్ల పెద్ద లాభం కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలను మూడేళ్ల కాలానికి ఎఫ్‌డీ చేస్తే, కేవలం 0.50 అదనపు వడ్డీ వల్ల మీకు అదనంగా రూ.15,000 ఆదాయం వస్తుంది! అదే రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే మీ జేబులోకి అదనంగా ₹30,000 చేరుతుంది. అందుకే డిపాజిట్ చేసేముందు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువ వడ్డీ ఇచ్చే టాప్ 7 బ్యాంకులు (FD interest rates)
- మూడేళ్ల కాలపరిమితికి ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను ఇస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- 1. ICICI Bank: ఈ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 6.60% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.20% వడ్డీని అందిస్తోంది.
- 2. Federal Bank: ఫెడరల్ బ్యాంక్ మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.70% వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీ ఇస్తోంది.
- 3. HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడేళ్ల కాలానికి సాధారణ పౌరులకు 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% వడ్డీ ఇస్తుంది.
- 4. Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడేళ్లకు 6.40% వడ్డీ ఇస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ అందిస్తుంది.
- 5. Union Bank of India: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.60% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.10% వడ్డీని అందిస్తోంది.
- 6. State Bank of India (SBI): దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ, మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.30%, సీనియర్ సిటిజన్లకు 6.80% వడ్డీ ఇస్తోంది. అయితే ఇక్కడ అత్యధిక వడ్డీ రేట్లు రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితికి లభిస్తాయి.
- 7. Canara Bank: కెనరా బ్యాంక్ మూడేళ్ల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% ఇస్తుంది. కానీ, 444 రోజుల ప్రత్యేక కాలపరిమితికి అత్యధికంగా 6.50%, 7.00% వడ్డీని అందిస్తుంది.
పెట్టుబడి పెట్టే ముందు..
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం మూడేళ్ల రేట్లను చూడకుండా, బ్యాంక్ ఏ కాలపరిమితికి అత్యధిక వడ్డీ ఇస్తుందో పోల్చుకోండి. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే 0.50% అధిక వడ్డీని పొందుతారు. కాబట్టి, ఆ ప్రయోజనాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. అయితే కొన్నిసార్లు ఈ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టేముందు సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌ను లేదా బ్రాంచ్‌ను సంప్రదించండి. అలాగే పెద్ద పెట్టుబడులు చేసేముందు నిపుణుడైన ఆర్థిక సలహాదారుడ్ని సంప్రదించడం కూడా ముఖ్యం.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications