కరోనా మహమ్మారి తగ్గిన నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), HDFC, యాక్సిస్ బ్యాంకు తదితర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగాయి. యాక్సిస్ బ్యాంకు ఇటీవలే రూ.2 కోట్లకు పైన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇది మార్చి 17వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చూద్దాం...

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు
- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.5 శాతం వర్తిస్తుంది.
- 30 రోజుల నుండి 45 రోజులు, 46 రోజుల నుండి 60 రోజులు, 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3 శాతం వర్తిస్తుంది.
- 91 రోజుల నుండి 120 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.5 శాతం వర్తిస్తుంది.
- 6 నెలల 1 రోజు నుండి 9 నెలలు, 9 నెలల ఒకరోజు నుండి 1 ఏడాది వరకు కాలపరిమితిపై వడ్డీ రేటు 4.4 శాతం వర్తిస్తుంది.
- ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితి FDపై 5.10 శాతం వడ్డీ రేటు ఉంది.
- మూడేళ్ల ఒకరోజు నుండి అయిదేళ్లు కాలపరిమితిపై వడ్డీ రేటు 5.45 శాతం వర్తిస్తుంది.
- అయిదేళ్ల 1 రోజు నుండి 10 ఏళ్ళ కాలపరిమితిపై వడ్డీ రేటు 5.75 శాతం వర్తిస్తుంది.

SBI వడ్డీ రేటు
- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుండి 29 రోజులు, 30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.9 శాతం వర్తిస్తుంది.
- 46 రోజుల నుండి 60 రోజులు, 61 రోజుల నుండి 90 రోజులు, 91 రోజుల నుండి 120 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.90 శాతం వర్తిస్తుంది.
- ఆరు నెలల 1 రోజు నుండి 9 నెలలు, 9 నెలల ఒకరోజు నుండి ఏడాది, ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 4.4 శాతం వర్తిస్తుంది.
- రెండేళ్ల ఒకరోజు నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.20 శాతం వర్తిస్తుంది.
- మూడేళ్ల 1 రోజు నుండి అయిదేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.45 శాతం వర్తిస్తుంది.
- అయిదేళ్ల 1 రోజు నుండి పదేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.5 శాతం వర్తిస్తుంది.

PNB వడ్డీ రేటు
- 7 రోజుల నుండి 14 రోజులు, 15 రోజుల నుండి 29 రోజులు, 30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 2.90 శాతం వర్తిస్తుంది.
- 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25 శాతం వర్తిస్తుంది.
- 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమతిపై 3.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
- 180 రోజుల నుండి 270 రోజులు, 271 రోజుల నుండి 1 ఏడాది లోపు కాలపరిమతిపై వడ్డీ రేటు 4.4 శాతం వర్తిస్తుంది.
- ఏడాది ఒకరోజు నుండి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5 శాతం వర్తిస్తుంది.
- రెండేళ్ల ఒకరోజు నుండి మూడేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
- మూడేళ్ల ఒకరోజు నుండి అయిదేళ్లు, అయిదేళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

HDFC బ్యాంకు వడ్డీరేటు
- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.5 శాతం వర్తిస్తుంది.
- 30 రోజుల నుండి 45 రోజులు, 46 రోజుల నుండి 60 రోజులు, 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3 శాతం వర్తిస్తుంది.
- 91 రోజుల నుండి 120 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.5 శాతం వర్తిస్తుంది.
- 6 నెలల 1 రోజు నుండి 9 నెలలు, 9 నెలల ఒకరోజు నుండి 1 ఏడాది వరకు కాలపరిమితిపై వడ్డీ రేటు 4.4 శాతం వర్తిస్తుంది.
- ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5శాతం వర్తిస్తుంది.
- మూడేళ్ల ఒకరోజు నుండి అయిదేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.45 శాతం వర్తిస్తుంది.
- అయిదేళ్ల 1 రోజు నుండి 10 ఏళ్ళ కాలపరిమితిపై వడ్డీ రేటు 5.60 శాతం వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications