HDFC Bank: 6.25% వరకు సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) పైన వడ్డీ రేటును 6.25 శాతం వరకు ఇస్తోంది. కరోనా నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు గత ఏడాది కాలంగా తగ్గిన విషయం తెలిసిందే. వివిధ బ్యాంకుల్లో వివిధ వడ్డీ రేట్లు ఉన్నాయి. HDFC బ్యాంకు మే 21, 2021 నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను సవరించింది. FD పైన ఏడు రోజుల కాలపరిమితి నుండి 29 రోజుల వరకు రెగ్యులర్ అయితే 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గరిష్టంగా 5.50 శాతం వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనంగా ఉంటుంది.

7 రోజుల నుండి 10 ఏళ్ల వరకు వడ్డీ రేటు
ఏడు రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై HDFC బ్యాంకు FD వడ్డీ రేటు 2.50 శాతంగా ఉంది. 30 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3 శాతం, 91 రోజులనుండి 6 నెలల కాలపరిమితిపై 3.5 శాతం, ఆరు నెలల నుండి ఏడాది లోపు 4.4 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఏడాది కాలపరిమితిపై 4.9 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 4.9 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.15 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.30 శాతం వడ్డీ రేటు, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.50 శాతం వడ్డీ రేటు ఉంది.

సీనియర్ సిటిజన్లకు అదనం
పైన పేర్కొన్నవి రెగ్యులర్ వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. రెగ్యులర్ వడ్డీ రేటు 2.50 శాతం నుండి 5.50 శాతం వరకు ఉంటే, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3 శాతం నుండి 6.25 శాతం వరకు ఉంది. ఇదిలా ఉండగా సీనియర్ సిటిజన్స్ కోసం HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్స్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను తెచ్చింది. అయిదేళ్లకాలం నుండి పదేళ్ల కాలంపై 0.50 శాతానికి అదనంగా 0.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇది నాన్-రెసిడెంట్ ఇండియన్స్‌కు వర్తించదు.

వివిధ వడ్డీ రేట్లు
- 7 - 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ 3.00%,
- 15 - 29 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ 3.00%,
- 30 - 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ 3.50%,
- 46 - 60 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ 3.50%,
- 61 - 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ 3.50%,
- 91 days - 6 months రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ 4.00%,
- 6 months 1 day 9 months రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, 4.90% సీనియర్,
- 9 months 1 day నుండి 1 ఏడాది లోపు, రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, సీనియర్ 4.90%,
- 1 Year రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ 5.40%,
- 1 year 1 day - 2 years రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ 5.40%,
- 2 years 1 day - 3 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.15%, రెగ్యులర్ 5.65%,
- 3 year 1 day- 5 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ 5.80%
- 5 years 1 day 10 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ 6.25%


Click it and Unblock the Notifications