Credit Cards: క్రెడిట్ కార్డులు ఇలా వాడితే.. ఎన్నో ఉపయోగాలు..!
మీకు బ్యాంకు అకౌంట్ ఉందా.. మీరు ఉద్యోగులా.. అయితే మీకు బ్యాంకుల నుంచి ఫోన్ వస్తుంది. సర్.. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఎలాంటి ఛార్జీలు ఉండవు తీసుకోండి అని చెబుతారు. కొంత మంది క్రిడెట్ కార్డు అవసరం లేకున్నా.. తీసుకుంటే పడి ఉంటుందని తీసుకుంటారు. కొందరు అవసరం కొద్ది తీసుకుంటారు. ఎలా తీసుకున్నా క్రెడిట్ కార్డుల వాడకం భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవడానికి భయపడే వారు. కానీ పరిస్థితి మారింది. రూ.10 జీతవం వచ్చే ఉద్యోగికి కూడా క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడాలి.
క్రెడిట్ కార్డు ఉపయోగించి వడ్డీ లేకుండా ఒక నెల గడపొచ్చు. మీ బిల్ జనరేట్ తేదీ ప్రతి నెలా 1 తేదీన ఉండి.. బిల్ పేమెంట్ తేదీ 17 తేదీన ఉంటే.. మీరు 2వ తేదీన క్రెడిట్ కార్డు వాడి ఏదైనా వస్తువు కొంటే.. దాని పేమెంట్ వచ్చే నెల 17 తేదీన చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు లాభం పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ తేదీ నాటికి కచ్చితంగా బిల్ పే చేయాలి. లేకుంటే మీ నుంచి భారీగా వడ్డీ వసూలు చేస్తారు. క్రెడిట్ కార్డు వాడకంలో కొన్ని టిప్స్ వాడితే ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి క్రెడిట్ కార్డు ఒక స్పెషల్ బెనిఫిట్ ను ఇస్తుంటుంది.

కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా సూపర్ మార్కెట్, ఆన్లైన్ కిరాణా కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. ఐతే అన్ని క్రెడిట్ కార్డులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డు అనేది రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్, బిగ్‌బాస్కెట్ వంటి ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద చేసే కిరాణా ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. ఇందుకు ప్రతి నెలా 2500 పాయింట్ల లిమిట్ ఉంటుంది. HSBC లైవ్+ క్రెడిట్ కార్డు అనేది కిరాణా సరుకులు, ఫుడ్ డెలివరీ, డైనింగ్ సేవలపై నేరుగా 10% క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం ఇస్తుంది. దీనికి నెల నెలా రూ.1000 లిమిట్ ఉంటుంది. రివార్డ్ పాయింట్ల ద్వారా మీరు వోచర్స్, లేదా క్యాష్ కన్వర్ట్ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్లను రిడీం చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డు వాడకానికి సొంతంగా లిమిట్ పెట్టుకోవాలి. మీకు క్రెడిట్ కార్డు లిమిట్ రూ.లక్ష ఉంటే.. మీరు అందులో 50 శాతం నుంచి 60 శాతం వరకే వాడుకుంటే బెటర్. కొంత మంది క్రెడిట్ ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఇది కూడా సరైంది కాదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కొంత మంది 3 నుంచి 4 క్రిడిట్ కార్డులు వాడతారు. కానీ ఇలా వాడకూడదు. ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు వాడితే సరిపోతుంది. మహా మూడు వాడొచ్చు. అంతుకు మించి వాడితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications