essential items: మీ ఇంటి ఖర్చులు పెరుగుతాయి.. సిద్ధంగా ఉండండి
రష్యా-ఉక్రెయన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే వారం నుండి మన దేశంలోను ఈ ధరలు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 110 డాలర్లు దాటింది. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.10 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుంకాలు కలిపితే ఈ ధర రూ.120కి చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అలాగే, సన్ ఫ్లవర్ ఆయిల్ మనకు ఉక్రెయిన్ నుండి ఎనభై శాతం, రష్యా నుండి పది శాతం వస్తుంది. దీంతో ఇప్పటికే నూనెల ధరలు కూడా లీటర్ పైన రూ.20కి పైగా పెరిగింది. ఇవే కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మన ఇంటి ఖర్చు పెరుగుతుంది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందే
దిగుమతి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది అధిక ద్రవ్యోల్భణానికి దారి తీస్తుంది. రష్యా, ఉక్రెయిన్ నుండి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం, అలాగే, వివిధ దేశాల నుండి సరఫరా చైన్ తెగిపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్ నుండి ప్రధానంగా సన్ ఫ్లవర్ ఆయిల్ వస్తుంది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పాల సంస్థలు ధరలను పెంచాయి. ఇటీవల అమూల్ ధరలు పెంచింది.
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు ముందే, అంటే గత మూడు నాలుగు నెలలుగా HUL, మారికో, బ్రిటానియా, నెస్ట్లే తదితర సంస్థలు ధరలను పెంచాయి. బిస్కట్లు, సబ్బులు, షాంపూలు, నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

గృహ బడ్జెట్ పెంపు
ఇన్-పుట్ ఖర్చులు పెరిగినందున ధరలు పెంచవలసి వస్తుందని వివిధ కంపెనీలు గత నాలుగైదు నెలలుగా చెబుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉత్పత్తులు మరింత భారంగా మారుతున్నాయి. కాబట్టి వచ్చే కొద్ది రోజులు గృహ బడ్జెట్‌కు మరింత ఎక్కువ కేటాయించవలసిందే! సరఫరా తగ్గడం, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. యుద్ధ ప్రభావం సన్ ఫ్లవర్ ఆయిల్, గోధుమలు, ఎల్పీజీ, క్రూడాయిల్ ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక, రామెటీరియల్ ఖర్చులు పెరగడంతో ఇతర కంపెనీలు ధరలు పెంచే అవకాశముంటుంది.

ఈ ధరల పెరుగుదల
వివిధ ఉత్పత్తుల విషయానికి వస్తే ఉక్రెయిన్, రష్యాల నుండి మనకు 90 శాతం సన్ ఫ్లవర్ నూనె ఉంది. మన వద్ద పామాయిల్ తర్వాత, ఎడిబుల్ ఆయిల్ రెండో అతిపెద్ద వినియోగ నూనె. 2021లో భారత్ 70 శాతం సన్ ఫ్లవర్ నూనెను ఉక్రెయిన్ నుండి, 20 శాతం రష్యా నుండి, 10 శాతం అర్జెంటీనా నుండి దిగుమతి చేసుకున్నది.
పాలు, పాలపదార్థాలకు కూడా ఇన్-పుట్ ఖర్చులు పెరిగాయి. దీంతో అముల్, పరాగ్, వెక్రా లీటర్ పాల పైన రూ.2 పెంచాయి.
చజమురు దిగుమతులు పెరగడంతో గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.


Click it and Unblock the Notifications