Money Mistakes: లైఫ్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థిక నిర్వహణ. అందుకే ప్రతిఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యత చాలా ముఖ్యం. లేకుంటే ఎంత డబ్బు సంపాదించినా దానిని సరైన రీతిలో నిర్వహించటంలో విఫలం అవుతారు. అందుకే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి డబ్బు విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.
ముందుగా ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ఫండ్ నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది దీని కోసం అవసరమైనంత మేర కేటాయించరు. ఉద్యోగం కోల్పోవటం, ఇంట్లోని సభ్యులు ఆసుపత్రి ఖర్చులు వంటి అనుకోని పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇది చాలా కీలకం. అందుకే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా మెుత్తాన్ని ఇందుకోసం కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండవ ముఖ్యమైన అంశం ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి. ఇది అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, తీవ్ర అనారోగ్యాలు వచ్చినప్పుడు ఆదుకుంటుంది. దీనిని తీసుకోని పక్షంలో పెద్ద ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రివ్యూ చేసుకోవటం తప్పనిసరి.

పన్ను చెల్లింపు విషయంలో చివరి క్షణం వరకు వేచి ఉండటం మంచిది కాదు. అందుకే టాక్స్ ప్లానింగ్ విషయంలో వాయిదాలు అస్సలు పనికిరావని టాక్స్ ప్లానర్స్ చెబుతున్నారు. టాక్స్ సేవ్ చేసుకోవటం కోసం చివరి నిమిషాల్లో ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది తప్పులు చేస్తుంటారు. ఇలాంటివి నివారించటం కోసం ప్రతి ఒక్కరూ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ప్రణాళికలను ప్రారంభించటం చాలా మంచిది. ఇదే సమయంలో మరో ముఖ్యమైన సూత్రం లక్ష్యం లేకుండా పెట్టుబడులు పెట్టడం. నిర్ణీత ఆర్థిక లక్ష్యం లేకుండా పెట్టుబడి పెట్టడం ఆర్థిక విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే సదరు పెట్టుబడి రిటర్న్స్ తో పాటు రిస్క్ విషయంలోనూ జాగ్రత్త అవసరం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. అందుకే అనుకోని పరిస్థితులను ఎదుర్కోవటానికి ముందస్తుగా మనల్ని మనం అప్ స్కిల్ చేసుకోవటం చాలా ముఖ్యమైన ఆర్థిక సూత్రం. ద్రవ్యోల్బణం పెరుగుతే అది కొనుగోలు శక్తిని నాశనం చేస్తుంది. అందుకే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత అయ్యే భవిష్యత్తు ఖర్చుల ప్లానింగ్‌లో ద్రవ్యోల్బణం రేటును లెక్కించటం అస్సలు మర్చిపోకూడదు.
ఇదే సమయంలో ఈఎంఐ, క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించాలి. లేకుండా ఆ ప్రభావం మన క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూలంగా పడుతుంది. ఇది భవిష్యత్తులో మనకు లోన్స్ దొరకటాన్ని కష్టతరం చేస్తుందని గుర్తుంచుకోండి. అలాకే ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోవాలి. వీటిలో ఏవైనా తప్పులను గమనించినట్లయితే వెంటనే క్రెడిట్ బ్యూరో దృష్టికి వాటికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. క్రెడిట్ నివేదిక ఎల్లప్పుడూ ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications