ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పీఎఫ్ (Provident Fund) అనేది ఒక వరం లాంటిది. రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పీఎఫ్ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది ఉద్యోగులు ఏదైనా కారణం వల్ల ఉద్యోగం మానేసినప్పుడు తమ పీఎఫ్ ఖాతా గురించి ఆందోళన చెందుతుంటారు. తాము పనిచేయడం లేదు కాబట్టి పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వడ్డీ రావడం ఆగిపోతుందని భావిస్తారు. అయితే అసలు పీఎఫ్ రూల్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఉద్యోగం మానేసినా వడ్డీ వస్తుందా?
సాధారణంగా ఒక ఉద్యోగి ఉద్యోగం నుండి తప్పుకున్న మూడు సంవత్సరాల తర్వాత వడ్డీ రావడం ఆగిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ EPFO నిబంధనల ప్రకారం.. మీరు ఉద్యోగంలో లేకపోయినా మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుపై ప్రభుత్వం వడ్డీని జమ చేస్తూనే ఉంటుంది. మీరు మొత్తం పీఎఫ్ విత్‌డ్రా (PF Withdraw) చేసుకునే వరకు లేదా మీకు 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ వడ్డీ ప్రయోజనం కొనసాగుతుంది.
వడ్డీ పొందాలంటే ఈ షరతులు తప్పనిసరి!
మీరు ఉద్యోగంలో లేకపోయినా నిరంతరాయంగా వడ్డీ పొందాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి..
- UAN లింక్: మీ పీఎఫ్ ఖాతా తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో అనుసంధానించబడి ఉండాలి.
- ఇన్-యాక్టివ్ అకౌంట్: ఒక ఉద్యోగి ఉద్యోగం వదిలేసిన 36 నెలల తర్వాత ఆ ఖాతా 'ఇన్-యాక్టివ్' (Inoperative) కేటగిరీలోకి వెళ్తుంది. అయినప్పటికీ.. పీఎఫ్ చట్టం ప్రకారం అకౌంట్ క్లోజ్ అయ్యే వరకు వడ్డీ జమ అవుతుంది.
- వయోపరిమితి: మీకు 58 ఏళ్లు నిండిన తర్వాత కూడా మీరు డబ్బు డ్రా చేసుకోకపోతే.. ఆపై వడ్డీ రావడం ఆగిపోతుంది. ఎందుకంటే 58 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి పదవీ విరమణ చేసినట్లుగా పరిగణించబడుతుంది.
డబ్బులు ఎప్పుడు డ్రా చేయాలి? (PF Withdraw Tips)
మీరు పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి డ్రా చేయాలనుకుంటే.. కనీసం రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉన్న తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మరో కొత్త కంపెనీలో చేరితే.. పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ (Transfer) చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల మీ పొదుపు మొత్తం పెరగడమే కాకుండా, పెన్షన్ ప్రయోజనాలు కూడా కొనసాగుతాయి.
మొత్తంగా తెలిసిందేంటంటే.. ఉద్యోగం మానేసినా పీఎఫ్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. అయతే చాలా మంది పొరపాటున ఉద్యోగం మానేసిన వెంటనే కంగారుగా పీఎఫ్ విత్‌డ్రా (PF Withdraw) చేసుకుంటారు. కానీ, అలా చేయడం వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు డబ్బు అత్యవసరం అయితేనే డబ్బుని విత్ డ్రా చేసుకోండి. లేకపోతే.. ఆ సొమ్మును ఖాతాలోనే ఉంచడి. దాని వల్ల లాంగ్ టర్మ్ లో
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications