మనలో చాలామంది రిటైర్మెంట్ అంటే ఇంకా చాలా టైం ఉందిలే అని అనుకోని వదిలేస్తున్నాం. కానీ వాస్తవానికి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం ఎంత తొందరగా మొదలెడతామో, అంత బెటర్ లైఫ్ మనకు భవిష్యత్తులో దొరుకుతుంది. ఇటీవల రిటైర్మెంట్ కన్సల్టెంట్ ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. ఆయన EPF, NPS మరియు మ్యూచువల్ ఫండ్స్ ఈ మూడు పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను పోల్చారు. వీటిలో ఎవరికీ ఎక్కువ రాబడి, ఎవరికి ట్యాక్స్ లాభాలు, రిటైర్మెంట్ తర్వాత ఎది మనకు స్థిరమైన ఆదాయం ఇస్తుందో వివరించారు.

అమిత్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలామంది యువ ఉద్యోగులు ఎక్కువ ఇంటికి తీసుకెళ్లే జీతం కోసం EPF, NPS కాంట్రిబ్యూషన్ తగ్గిస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్పస్ దూరమవుతుందని చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ రాబడి వస్తుందనిపించినా, పన్నులు, లాక్-ఇన్, రిస్క్ వంటి అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు.
EPF, NPS, మ్యూచువల్ ఫండ్స్ - ఎవరిది పై చేయి?
EPF అనేది భారతదేశంలో ఒక సొషల్ సెక్యూరిటీ పథకం. ఇది సుమారు 8.25% స్థిరమైన రాబడి ఇస్తుంది. ఉద్యోగి-యజమాని ఇద్దరి కాంట్రిబ్యూషన్‌కి కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మొత్తం మేచ్యూరిటీ సమయంలో పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఉదాహరణకు, నెలకు రూ. 27,000 పెట్టుకుంటే 30 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకు సుమారు రూ. 5 కోట్ల వరకు పెరుగుతుంది.
NPSలో ఈక్విటీ-డెబ్ట్ మిక్స్ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులు 10%, ప్రభుత్వ ఉద్యోగులు 14% వరకు కాంట్రిబ్యూట్ చేస్తారు. టైర్ 1 ఖాతాలో 60 ఏళ్ల వరకు లాక్-ఇన్ ఉంటుంది, కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌పై కూడా 80CCD(1), 80CCD(1B), 80CCD(2) కింద డిడక్షన్స్ వస్తాయి. రిటైర్మెంట్ సమయంలో 60% విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 40%తో యాన్యుటీ కొనాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ, హైబ్రిడ్, డెబ్ట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. రాబడి ఎక్కువే వస్తుంది కానీ పెట్టే డబ్బు మొత్తం జీతం నుంచి పన్ను కట్టిన తర్వాత మిగిలిన డబ్బుతోనే పెట్టాలి. అంటే 30% పన్ను బ్రాకెట్‌లో ఉన్నవారికి వాస్తవ పెట్టుబడి తక్కువ అవుతుంది. అలాగే రీడంప్షన్ సమయంలో లాభాలపై పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
చివరికి ఏది బెస్ట్?
అమిత్ చేసిన లెక్కల ప్రకారం, ఒకరు 25 ఏళ్లపాటు ప్రతి నెలా సమానంగా పెట్టుబడి పెడితే EPF ద్వారా దాదాపు రూ. 99 లక్షలు, NPS ద్వారా సుమారు రూ. 1.33 కోట్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దాదాపు రూ. 1.19 కోట్లు పొందవచ్చని ఆయన తెలిపారు.
దీంతో పన్ను మినహాయింపుల వల్ల NPS, EPFలు ఎక్కువ ప్రయోజనకరమని ఆయన చెప్పారు. "NPS స్పష్టంగా విన్నర్. దాన్ని వదిలేయడం తప్పు అవుతుంది. ముఖ్యంగా పాత ట్యాక్స్ రీజీమ్‌లో ఇది బిగ్ బెనిఫిట్ ఇస్తుంది" అని ఆయన చెప్పారు.
తన అనుభవం కూడా షేర్ చేస్తూ "నేను నా మొదటి ఉద్యోగంలో 2001లో EPF పెట్టడం మొదలు పెట్టాను. ఇప్పటికి అది రూ. 1 కోటికి పైగా పెరిగింది" అని చెప్పారు. కాబట్టి ఉద్యోగులు తమ యజమాని కాంట్రిబ్యూషన్‌ను నిర్లక్ష్యం చేయకుండా, చిన్న వయసులోనే EPF, NPS వంటివి ప్రారంభించాలని సూచించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications