For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈపీఎఫ్ఓ భారీ ఊరట, రూ.1 లక్ష వరకు మెడికల్ అడ్వాన్స్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల నుండి రుణాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు ఊరట కల్పించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కింద త‌మ స‌భ్యులు రూ.1ల‌క్ష వ‌ర‌కు ఉపసంహరించుకునేందుకు అనుమ‌తించింది.

ఒక‌వేళ ఈపీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్ అయితే కరోనా స‌హా ఏదైనా ప్రాణాంత‌క వ్యాధి చికిత్స కోసం రూ.1ల‌క్ష వ‌ర‌కు ఉపసంహరించుకోవచ్చు. ఆ న‌గ‌దు ఉపసంహరించుకోవడానికి హాస్పిటలైజేషన్ వ్య‌యంపై అంచ‌నాలు స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని EPFO తెలిపింది.

EPF members can withdraw medical advance of up to Rs 1 lakh for emergency hospitalisation

అధికారిక EPFO పోర్ట‌ల్: https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు వెళ్లాలి.
మీ UAN, పాస్‌వ‌ర్డ్, క్యాప్చా వివ‌రాలు న‌మోదు చేసి లాగిన్ కావాలి.
ఆన్‌లైన్ స‌ర్వీసెస్ ట్యాబ్‌కు వెళ్లి క్లెయిమ్ (ఫాం-31, 19, 10C, 10D)' ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
కొత్త పేజీపై UANతో అనుసంధానించిన బ్యాంకు ఖాతా వివ‌రాలు రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
బ్యాంకు ఖాతా వివరాలు వెరిఫై అయిన అనంతరం జాగ్ర‌త్త‌గా చదువుకొని, ఈపీఎఫ్‌వో ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్ ఆమోదించాలి.

ఆ తర్వాత టాప్‌కు వెళ్లి 'ప్రొసీడ్ ఫ‌ర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌', న‌గ‌దు ఉపసంహరణ కోసం ఆప్షన్లు నింపి 'మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ'ని ఎంపిక చేసుకోవాలి. అర్హులైన స‌భ్యుల‌కు మాత్ర‌మే ఈ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
ఈ మెడిక‌ల్ అడ్వాన్స్ ఉద్యోగికి గానీ లేదా వారి కుటుంబ స‌భ్యుల‌కు గానీ తీసుకోవ‌చ్చు.

ప్ర‌భుత్వ/ ప్ర‌భుత్వ రంగ సంస్థ/ సీజీహెచ్ఎస్ ప్యానెల్ అప్రూవ్ చేసిన ఆసుపత్రిలోనే రోగి త‌ప్ప‌నిస‌రిగా చికిత్స పొందాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌ ఎమ‌ర్జెన్సీలో ఏదైనా ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే, దానిని నిపుణుల టీమ్ ఆమోదించాక మెడిక‌ల్ అడ్వాన్స్ ల‌భిస్తుంది.

English summary

ఈపీఎఫ్ఓ భారీ ఊరట, రూ.1 లక్ష వరకు మెడికల్ అడ్వాన్స్ | EPF members can withdraw medical advance of up to Rs 1 lakh for emergency hospitalisation

EPF members can withdraw medical advance of up to Rs 1 lakh for emergency hospitalisation including Covid.
Story first published: Monday, June 7, 2021, 21:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X