ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPF) ఇటీవల వడ్డీ రేటును 43 ఏళ్ల కనిష్టం 8.1 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఇది 8.50 శాతంగా ఉండగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 0.40 శాతం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు తగ్గించడం వల్ల ఇది ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లపై ప్రభావం చూపుతుంది. ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల వారి మొత్తంపై ప్రభావం పడుతుంది.

వడ్డీ రేటు తగ్గింపు
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో ఇతర చిన్న మొత్తాల పథకాల వడ్డీ రేట్లను కూడా జూన్ త్రైమాసికానికి గాను తగ్గించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. FY23 మొదటి త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లపై తుది నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నాటికి తీసుకోవచ్చు. 'స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్ల తగ్గింపుకు అవకాశముంది. వాటిని ఎక్కువ కాలం ఒకేలా కొనసాగించడం వల్ల విస్తృత వడ్డీ రేటు వాతావరణంపై ప్రభావం ఉంటుంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతానికి తగ్గించారు.' అని చెబుతున్నారు.

వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో
గత సంవత్సరం పశ్చిమ బెంగాల్, అసోం వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లలో కలవరం లేకుండా ఉండేందుకు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పైన వడ్డీ రేట్లలో తగ్గింపును కేంద్రం వేగంగా మార్చవలసి వస్తోందని చెబుతున్నారు. అయితే కరోనా నుండి కోలుకొని ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కనీసం స్థిరంగా ఉండాలనే వాదనలు కూడా లేకపోలేదు. కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్మాల్ సేవింగ్స్ రేట్లను తగ్గించవద్దని కోరుతున్నారు.

వడ్డీ రేట్లు ఇలా
వివిధ ప్రభుత్వ ప్రాయోజిత సేవింగ్స్ స్కీమ్స్ విషయానికి వస్తే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈఫీఎప్ వడ్డీ రేటు 8.1 శాతంగా ఉంది. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం. సుకన్య సమృద్ధి యోజన 7.5 శాతంగా ఉంది. ఇవి ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇక 5 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్ పైన 6.7 శాతం, ట్యాక్స్ తర్వాత 5.3 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర 6.9 శాతం, ట్యాక్స్ తర్వాత 5.5 శాతానికి, ఎస్బీఐ టర్మ్ డిపాజిట్ 5.5 శాతం, ట్యాక్స్ తర్వాత 4.4 శాతంగా ఉంటోంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications