Flipkart సూపర్ యాప్ కొత్త సర్వీస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీ ఆఫర్..
Super Money Fixed Deposit: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ "సూపర్ మనీ" సూపర్ ఎఫ్‌డీ అనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం దేశంలోని అనేక బ్యాంకులు, పోస్టాఫీసు పథకాలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆఫర్ చేస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ కంటే ఆకర్షనీయమైన రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సూపర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగదారులు నేరుగా యూపీఐ ద్వారా సులభంగా చేపట్టవచ్చు. దీని కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై గరిష్ఠంగా వడ్డీ రేటు 9.5 శాతం వరకు ఆఫర్ చేయబడుతోంది. సూపర్ మనీ తన 7 మిలియన్ల వినియోగదారుల కోసం సూపర్ ఎఫ్‌డిని మొదటిసారిగా భారతదేశంలో ఈకామర్స్ సంస్థ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని కింద వినియోగదారులు తమ పెట్టుబడిని కేవలం రూ.1000 నుంచి ప్రారంభించవచ్చు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే సూపర్ మనీ తన కస్టమర్లకు రిజర్వు బ్యాంక్ లైసెన్సు కలిగి వ్యాపారం చేస్తున్న 5 బ్యాంకుల నుంచి డిపాజిట్ పథకాన్ని ఎంచుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక సురక్షత గురించి పరిశీలిస్తే.. సూపర్ మనీ ద్వారా చేసిన అన్ని పిక్చర్ డిపాజిట్లు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు కవర్ చేయబడతాయి.

సూపర్ ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలనే విషయాన్ని పరిశీలిస్తే.. ముందుగా వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్ నుంచి ఇందుకోసం సూపర్ మనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇష్టమైన బ్యాంక్ FDని ఎంచుకుని దానికి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా వినియోగదారులు తమ యూపీఐ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. సూపర్ FD ఖాతా పూర్తిగా డిజిటల్ అయినందున దీనిని ఇంటి వద్ద నుంచే నేరుగా చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. పైగా పూర్తి ఖచ్చితత్వంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా కాగిత రహితంగా డిపాజిట్ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది.
స్టాక్ మార్కెట్ల ఓలటాలిటీతో పాటు అస్థిర పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రస్తుతం ప్రజల్లో అత్యుత్తమ రాబడిని అందించే సాధనాలుగా పరిగణించబడుతున్నాయి. పైగా భారతదేశంలో ప్రజలు ఇతర పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టడం కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అందువల్ల పోస్టాఫీసుల చిన్న పొదుపు పథకాలతో దేశంలోని బ్యాంకులు పోటీ పడుతూ బెస్ట్ వడ్డీ రేట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్నాయి. సూపర్ మనీతో ఇది మరింత సులభతరంగా మారిపోయిందని ప్రస్తుతం చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహా సేవలను మార్కెట్లో మరికొన్ని యాప్స్ కూడా ప్రస్తుతం అందిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications