కరోనా తర్వాత అందరిలోను పెట్టుబడి ప్రణాళికలు పెరిగాయి. అయితే హడావుడిగా పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక చిక్కులు తలెత్తవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందు అన్నీ ఆలోచించి ముందడుగు వేయాలి. స్టాక్స్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, రియాల్టీ, డిజిటల్ కాయిన్స్... ఇలా వివిధ వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే పెట్టుబడి పెట్టినప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఓపికతో ఉండటం, మీ డబ్బును అలా పెట్టి వదిలేయడం, అవసరమైనప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం, రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకపోవడం వంటివి ఉండాలి.

ఓపిక అవసరం
ఇన్వెస్ట్ చేసినప్పుడు కాస్త ఓపికతో ఉండటం తప్పనిసరి. పెట్టుబడి సూత్రం 'సహనం ఒక ధర్మం' అని గుర్తించాలి. మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీ రిటర్న్స్ పెంచుకోవాలనుకుంటే ఓపిక అవసరం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సుదీర్ఘ కాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే కొన్నిసార్లు తక్కువ సమయంలోనే మీకు మంచి రిటర్న్స్ అందించవచ్చు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి వేచి చూసే పరిస్థితి రావొచ్చు. కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలి.
ఒకవేళ మీకు ఓపిక లేకుంటే కనుక మీ పెట్టుబడులను ఆటోమేట్ చేసే అంశాన్ని పరిశీలించాలి. అప్పుడు మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అయితే మీ పెట్టుబడి వ్యూహానికి కట్టుబడి ఉండాలి. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో మీ ఆర్థిక ప్రణాళికను పునఃపరిశీలించాలి.

అప్పుడు ఎక్స్‌ట్రా మొత్తాన్నే ఇన్వెస్ట్ చేయాలి
మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు ఆ డబ్బుతో ఏ అవసరం లేకుండా ఉన్నది అయి ఉండటం మంచిది. 'మీరు ఎంత ఎక్కువగా డబ్బును నిర్వహిస్తారో (అంటే మీ చేతిలో నిత్యం అట్టిపెట్టుకోవడం) అప్పుడు మీ వద్ద అది అంత తక్కువ అవుతుంది' అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే మీ చేతిలో డబ్బులు ఉంటే అది వృధా కావొచ్చు లేదా ఖర్చు చేసే దాని కంటే ఎక్కువగా చేయవచ్చునని సూచిస్తున్నారు. మీ వద్ద ఎక్కువగా ఉన్నది అనుకున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు సగటు పెట్టుబడిదారు కంటే మెరుగ్గా ఉండాలనుకుంటే దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలి.

నిపుణుల సలహాలు
పెట్టుబడి విషయంలో మీకు అంతంత మాత్రమే అవగాహన ఉంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈక్విటీ లేదా బంగారం లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటే లేదా ప్రకటనలు ఆకర్షణీయంగా కనిపించినంత మాత్రాన ఇన్వెస్ట్ చేయకూడదు. పూర్తి అవగాహన కలిగి ఉండాలి లేదా నిపుణులు సలహాలు తీసుకోవాలి. మీకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ అవసరమైన సందర్భంలోను సలహాలు తీసుకోవాలి. ఉదాహరణకు మీకు ఈక్విటీ మార్కెట్ పైన పట్టు ఉన్నప్పటికీ ఓ స్టాక్ కొనుగోలు చేయాలనుకుంటే దానిపై లేదా ఆ రంగంపై మరింత పట్టు ఉన్న వారి సలహాను తీసుకోవాలి.

మరిన్ని..
దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడంతో పాటు రిస్క్ వద్దనుకుంటే తక్కువ రిటర్న్స్ వచ్చినప్పటికీ సురక్షిత వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.
దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయని భావిస్తే.. ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీరు రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
మీ స్టాక్ పైన ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి.
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి నిపుణులు సలహాలు, పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి.


Click it and Unblock the Notifications