క్రెడిట్ కార్డులు చాలా సౌకర్యవంతమైనవి. రొజువారి ఖర్చులు, షాపింగ్, ట్రావెల్, లేదా అనుకోని పరిస్థితుల్లో మనం వీటిని సులభంగా ఉపయోగించగలుగుతాం. కానీ, ఈ సౌలభ్యం చాలా మందిని రుణంలోకి తీసుకువెళుతుంది. మొదట చిన్న మొత్తాలు రుణంగా తీసుకున్నా, ప్రతి నెల బ్యాలెన్స్ రోలింగ్ అవ్వడం, అధిక వడ్డీ రేట్లు కారణంగా రుణం గణనీయంగా పెరుగుతుంది. కొందరు క్రెడిట్ కార్డ్ యూజర్లు సంవత్సరాలుగా ఈ రుణ చక్రంలో మునిగిపోతూ, చెల్లింపులు చేయలేకపోయి, ఆర్థిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి కారణంగా నిరుత్సాహానికి గురవుతారు. ఈ సమస్యను అర్థం చేసుకుని, సులభమైన విధానాలతో రుణాన్ని తగ్గించడం, ఆర్థిక నియంత్రణను తిరిగి పొందడం అత్యంత అవసరం.

ZET కో-ఫౌండర్ & CEO మనిష్ శరా చెప్పినట్టు "మొదట మీ మొత్తం రుణాన్ని అర్థం చేసుకోండి, అధిక వడ్డీ ఉన్న చెల్లింపులను ప్రాధాన్యం ఇవ్వండి, ప్రతి నెల కనీసం సరైన చెల్లింపులు చేయండి. రుణం నిర్వహణలో సహాయం చేసే కంపెనీలతో డెబ్ట్ కన్సాలిడేషన్ లాంటి స్ట్రాటజీలు ఉపయోగించవచ్చు, లేక బ్యాంక్‌తో సెటిల్‌మెంట్ గురించి చర్చించవచ్చు. నియమితమైన ఖర్చుతో పాటు ఈ విధానాలు వడ్డీ తగ్గించడంలో మరియు క్రెడిట్ ప్రొఫైల్ బలపరచడంలో సహాయపడతాయి.
రుణం నుండి బయటపడటానికి 5 సులభమైన స్టెప్స్ ఇవే:
1. మొత్తం రుణాన్ని అంచనా వేయండి: మొదట అన్ని క్రెడిట్ కార్డ్ ఖాతాల బ్యాలెన్స్‌లు, వడ్డీ రేట్లు లెక్కించండి. ఏ ఖాతా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుందో గుర్తించండి.
2. అధిక వడ్డీ కార్డులను ముందుగా చెల్లించండి: అధిక వడ్డీ ఉన్న కార్డులను ముందుగా తీర్చడం ద్వారా మొత్తం వడ్డీ ఖర్చు తగ్గుతుంది. దీనిని 'అవలంచ్ పద్ధతి' అంటారు. ఇలా చేస్తే రుణ భారం క్రమంగా తగ్గుతుంది.
3. కన్సాలిడేషన్ ఆలోచించండి: మీ వద్ద ఎక్కువ వడ్డీ రేట్లతో పలు క్రెడిట్ కార్డులు ఉంటే, వాటిని ఒకే రుణంలో కలపవచ్చు. దీని కోసం పర్సనల్ లోన్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫర్ ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే చెల్లింపులు సులభమవుతాయి, మొత్తం ఖర్చు తగ్గుతుంది, మరియు సమస్యలు తక్కువగా ఉంటాయి. ముందుగా ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సలహా తీసుకోవడం మంచిది.
4. సరైన చెల్లింపు ప్రణాళిక చేయండి: ప్రతి నెల మీ ఆదాయం ప్రకారం బడ్జెట్ తయారు చేసి, ఆలోకించిన మొత్తం రుణం చెల్లింపుకు కేటాయించండి. రుణం మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువ అవ్వేవరకు కొత్త కొనుగోళ్లు చేయవద్దు.
5. అవసరమైతే సెటిల్‌మెంట్ లేదా చర్చ చేయండి: చెల్లింపులు కష్టం అయినప్పుడు, మీ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థను సంప్రదించండి. సెటిల్‌మెంట్ లేదా హార్డ్ షిప్ ప్లాన్ ద్వారా రుణాన్ని సులభంగా చెల్లించవచ్చు, ముఖ్యంగా మీరు దాన్ని క్రమంగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముఖ్యంగా, క్రెడిట్ కార్డ్ రుణం నుండి బయటపడటానికి క్రమానుసారం, స్థిరమైన ప్రయత్నం మాత్రమే ఫలితం ఇస్తుంది. ఇది మనసు, ఆర్థిక శ్రద్ధ, మరియు నియమితమైన ఖర్చు నియంత్రణను పరీక్షిస్తుంది. నిజంగా ప్రయత్నించి, పూర్వపు తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తేనే ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యం.
రుణంలో తిరిగి పడకుండా ఉండడానికి సూచనలు:
క్రెడిట్ కార్డ్ రుణంలో తిరిగి పడకుండా ఉండటానికి, మీ క్రెడిట్ లిమిట్‌లో 30-40% మాత్రమే వాడండి మరియు పూర్తి లిమిట్‌ను ఉపయోగించవద్దు. ఖర్చులను ట్రాక్ చేయడానికి మొబైల్ యాప్ లేదా నోట్‌బుక్ ఉపయోగించండి, అలాగే అవసరం లేని వస్తువులను వెంటనే కొనుగోలు చేయకండి. అదనంగా, అనుకోని ఖర్చుల కోసం అత్యవసర నిధి సృష్టించండి, దీని వల్ల ఊహించని పరిస్థితులలో క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications