కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు సహా వివిధ రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. చాలా కంపెనీలు మున్ముందు కాలంలో దాదాపు 25 శాతం ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోంకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సంస్థలు ఇంటి నుండి పని చేసే హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను మొదలు పెట్టడంతో ఈ పరిస్థితికి అలవాటుపడిన ఉద్యోగులు ఇంటి విషయంలో ఆధునికీకరణకు, ఇంటి విస్తరణకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం
ఉద్యోగులు చాలామంది ప్రత్యేక హోం ఆఫీస్ గది కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంటిలో వర్క్ కోసం ప్రత్యేక గదిని ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోంకు తోడు వివిధ బ్యాంకులు హోంలోన్ వడ్డీ రేట్లు తగ్గించడం, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు అందించాయి. దాదాపు సంవత్సరంన్నరగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. స్థిరమైన రియాల్టీ మార్కెట్, కొత్త గృహ నిర్మాణ పథకాలు, డ్రీమ్ హౌస్ కొనేందుకు ఆసక్తి ఉంటే ఇది సరైన సమయంగా చెబుతున్నారు.

PNB హౌసింగ్ ఆన్ లైన్ లోన్ అప్లికేషన్
ఇదివరకు హోమ్ లోన్ దరఖాస్తు ప్రక్రియ పెద్దదిగా ఉండేది. హోమ్ లోన్ కోసం అంటే ఎన్నో డాక్యుమెంట్లు అవసరమయ్యేది. బ్యాంకులకు పలుమార్లు వెళ్లడం, ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరపడం ఉండేది. వీటన్నింటికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో, కరోనా పరిస్థితుల నేపథ్యంలో PNB హౌసింగ్ ఆన్ లైన్ లోన్ అప్లికేషన్ ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టింది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తిగా సాఫీగా సాగుతుంది. ఆన్ లైన్ వీడియో కేవైసీ, ఓటీపీ, ఈ-సంతకం ఉపయోగించి ధృవీకరణ వంటివి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. ఆన్ లైన్ ద్వారా ఇంటి నుండే రుణ దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు.

గిఫ్ట్ ఓచర్ కూడా
ఆన్ లైన్ దరఖాస్తు ద్వారా గిఫ్ట్ ఓచర్స్ కూడా పొందవచ్చు. రుణం ఆన్ లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత రుణ ప్రాసెసింగ్ స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. PNB హౌసింగ్ నుండి గృహరుణం పొందడానికి చేయవలసింది కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపడం, మీ కేవైసీ, ఆదాయ పత్రాలను అప్ లోడ్ చేయడం, క్రెడిట్ కార్డు లేదా వాలెట్ ఉపయోగించి ప్రారంభ ప్రాసెసింగ్ ఫీజును డిజిటల్‌గా చెల్లించి, ఈ-దరఖాస్తు ఫారంకు ఈ-సంతకం చేసి సమర్పించడం చేయాలి. సిబ్బందితో వ్యక్తిగత సంబంధం లేకుండా రుణం ఆమోదించబడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications