పర్సనల్ లోన్, హోమ్ లోన్ వంటి లోన్లు తీసుకునేటప్పుడు చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ ఏ డాక్యుమెంట్ తప్పినా లోన్ మంజూరు ఆగిపోతుందన్న భయం కూడా ఉంటుంది. కానీ అదే జాగ్రత్తలు లోన్ పూర్తిగా తీర్చిన తర్వాత తీసుకోవడం చాలా మంది మర్చిపోతుంటారు. ఫైనల్ పేమెంట్ చేసిన వెంటనే కేసు ముగిసిందని అనుకుని, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయకపోవడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోన్ క్లోజర్ కూడా ఒక ముఖ్యమైన దశగా చూడాల్సిన అవసరం ఉంది.

ఈ దృష్టిలో, లోన్ క్లోజ్ లేదా ప్రీ-క్లోజ్ చేస్తే పాటించాల్సిన ముఖ్యమైన అడుగులు:
1. ప్రీ-క్లోజర్ ఫీజులు
కొన్ని బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCs) లోన్ గడువు ముగిసే ముందు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే, దానికి ఫోర్‌క్లోజర్ ఫీజులు లేదా పెనాల్టీల రూపంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. గృహ రుణాల (హోం లోన్స్) విషయంలో ఈ పెనాల్టీ ఉండదు. కానీ వాహన రుణాల (వాహన లోన్‌లు) మరియు వ్యక్తిగత రుణాలపై సాధారణంగా 1% నుండి 5% వరకు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండొచ్చు. కాబట్టి మీరు లోన్ క్లోజ్ చేసేముందు ప్రీ పేమెంట్ ఛార్జీలు ఉన్నాయా లేకపోయినా క్లియర్ గా తెలుసుకోండి.
2. నో అబ్బజెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందండి
NOC అనేది మీరు లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించారన్నదానికి ఆధారంగా నిలుస్తుంది. ఇది తర్వాత ఎలాంటి డిస్‌ప్యూట్‌లు లేకుండా ఉండేందుకు అవసరం. NOCలో ఈ విషయాలు తప్పనిసరిగా ఉండాలి. మీ పేరు, చిరునామా, లోన్ అకౌంట్ నంబర్, లోన్ క్లోజర్ సంబంధిత సమాచారం. ఇది మీకు అప్పటి దాకా ఉన్న ఎటువంటి రుణ బాధ్యతలు లేదని నిరూపించే ముఖ్యమైన పత్రం.
3. ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి పొందండి
హోం లోన్ తీసుకున్నప్పుడు మీరు బ్యాంక్‌కు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటారు. సేల్ డీడ్, కన్వేయెన్స్ డీడ్, పవర్ ఆఫ్ అటార్నీ, కాన్సల్డ్ చెక్ (Cancelled Cheque) మొదలైనవి లోన్ రీపే చేసిన తరువాత, అవన్నీ తిరిగి పొందటం ఎంతో అవసరం.
4. లియెన్ (Lien) తొలగింపు
హోం లోన్‌లలో, బ్యాంకులు మీ ప్రాపర్టీ మీద లియెన్ పెట్టి ఉంటారు అంటే మీరు ఆ ప్రాపర్టీని అమ్మలేరు. మీరు లోన్ రీపే చేసిన తరువాత బ్యాంక్ వాళ్లతో కలిసి రెజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి లియెన్ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలి.
5. మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) అప్డేట్ అయిందో లేదో పరిశీలించండి
మీ లోన్ రీపే చేయబడిన విషయాన్ని బ్యాంక్ లేదా NBFC సిబిల్ డేటాబేస్‌కి అప్డేట్ చేయాలి. కానీ ఇది ఆలస్యంగా జరిగితే మీ సిబిల్ రిపోర్టులో అప్పటికీ బ్యాలెన్స్ ఉన్నట్టు చూపించవచ్చు. ఇది మీరు కొత్తగా లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, మీ తాజా సిబిల్ రిపోర్టును చెక్ చేసి, అవసరం అయితే బ్యాంక్‌ను సంప్రదించి అప్డేట్ చేయించుకోవాలి.
లోన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, దానిని విజయవంతంగా తీర్చిన తర్వాత సరైన లోన్ క్లోజర్ ప్రక్రియను పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఫైనల్ పేమెంట్ చేశాక తమ పని పూర్తయిందని భావిస్తారు, కానీ పైన వివరించిన ముఖ్యమైన దశలను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు, చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చ. కాబట్టి ఈ పైన చెప్పిన ప్రకారం అన్నీ క్లియర్ చేసుకుంటే అప్పుడు మీ లోన్ క్లియర్ అయ్యినట్టు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications