2021లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌లో ఈ స్టాక్స్ జంప్ చేయొచ్చు
2020లో సూచీలు 15 శాతం మేర ర్యాలీ చేశాయి. అయితే ఎస్ అండ్ పీ బీఎస్ఈ బ్యాంకెక్స్ 2.1 శాతం, బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ 4 శాతం, యుటిలిటీస్ 0.4 శాతం మేర క్షీణించాయి. 2020లో కొన్ని స్టాక్స్ అండర్-పర్ఫార్మ్ చూసినప్పటికీ 2021లో ప్రారంభ వారంలోనే మంచి ఫలితాలు సాధించాయి. కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగం గత ఏడాది నష్టపోయింది. అయితే చివరి త్రైమాసికంలో పుంజుకుంది. కొత్త ఏడాదిలో కూడా ఇప్పటి వరకు దూసుకెళ్తున్నాయి.
దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జంప్

బ్యాంకింగ్, ఫైనాన్షియల్
పలు ప్రయివేటురంగ బ్యాంకులు ఇటీవల దూసుకెళ్తున్నాయి. వీటికి పోటీగా ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా దుమ్మురేపుతున్నాయి. 2019లో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 25 శాతానికి పైగా లాభపడ్డాయి. 2020లోను చివరలో పుంజుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందునఈ ఏడాది కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత రెండు నెలల కాలంలో వేగంగా పుంజుకున్నాయి.

రాణించే అవకాశం
ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గత ఏడాదిభారీగా పడిపోయింది. అయితే ఇది క్రమంగా పుంజుకుంటోంది. FY20-FY23 మధ్య 23 శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని భావిస్తున్నారు. ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్, మణప్పురం ఫైనాన్స్, కాన్ ఫిన్ హోమ్స్, ఫెడరల్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఆవాస్ ఫైనాన్షియర్స్ సహా దాదాపు పలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఈ ఏడాది రాణించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకులు జంప్ చేశాయి.

సరికొత్త శిఖరాలకు
మార్కెట్లు గత రెండు నెలలుగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నిన్న (జనవరి 11) 49,000 మార్కును దాటింది. రెండు నెలల కాలంలోనే 7000 పాయింట్లు జంప్ చేసింది. నిఫ్టీ 50 14,500 పాయింట్లను క్రాస్ చేసింది.