మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. కరోనా సమయంలో చాలామంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని స్టాక్స్ తక్కువ కాలంలో అధిక రిటర్న్స్ ఇచ్చాయి. అదే సమయంలో మరికొన్ని నష్టాలను నమోదు చేశాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోను పెట్టుబడులు పెరిగాయి. అయితే మీ డబ్బును పెట్టుబడి పెట్టే సమయంలో ఉద్వేగానికి గురికావొద్దు. డబ్బులు ఉన్నాయని ఇష్టారీతిన రిస్క్ తీసుకోవద్దు. ఇన్వెస్ట్ చేసే సమయంలో అన్ని పరిశీలించి, స్టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకొని పెట్టుబడి పెట్టాలి. కేవలం స్టాక్ మార్కెట్లోనే కాదు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రమత్తంగా ఉండాలి.

ఎమర్జెన్సీ సమయంలో.. బ్యాంకులో నగదు
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మీరుకొత్త ఇన్వెస్టర్ అయితే కనుక ట్రాప్‍లో పడే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే సమయంలో వీటిని గుర్తుంచుకోండి. ఇలాంటి పొరపాట్లకు దూరంగా ఉండండి.
మనకు అనుకోని ఖర్చులు రావడం సహజం. బిల్లులు అధికంగా రావడం లేదా మీ ఉద్యోగం పోవడం లేదా ఇతర ఆరోగ్యపరమైన ఖర్చులు వస్తే ఇలాంటి పెట్టుబడులు అవసరానికి ఉపయోగపడవచ్చు.
పెట్టుబడి పెట్టే సమయంలో కొంత డబ్బు బ్యాంకులో కూడా ఉండాలి. అత్యవసరమైతే స్టాక్‌లో చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటారు. కానీ ఆ స్టాక్ నష్టాల్లో ఉంటే... అలాంటి సమయంలో బ్యాంకులో పెట్టిన డబ్బును ఉపయోగించవచ్చు. బ్యాంకులో నగదు ఉంటే ఎమర్జెన్సీ సమయంలో స్టాక్ నష్టాల్లో ఉంటే కనుక దానిని ఉపసంహరించకుండా ముందుకు వెళ్లవచ్చు.

స్వల్పకాలిక లక్ష్యం
స్వల్పకాలిక లక్ష్యంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే స్టాక్ క్రాష్ అయితే అది కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి స్వల్పకాలానికి కాస్త దూరంగా ఉండాలి.
క్రిస్టల్ బాల్ లేకుండా వివిధ స్టాక్స్ ఎలా పని చేస్తాయో కచ్చితంగా చెప్పడం అసాధ్యం. కాబట్టి ఆయా స్టాక్స్‌ను పరిశీలించకుండా ఆయాచితంగా ఇన్వెస్ట్ చేయడం సరికాదు. యాదృచ్చికంగా స్టాక్స్‌ను ఎంచుకొని, ఉత్తమ రిటర్న్స్ కోసం ఆశించవద్దు.

డిప్ సమయంలో..
స్టాక్స్ హఠాత్తుగా పడిపోయినప్పుడు ఎమోషన్‌కు లోనై, వాటిని విక్రయించడం సరికాదు. ఎందుకంటే దీర్ఘకాలంలో ఇవి మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చు. అలా అని అట్టి పెట్టుకోమని చెప్పడం కాదు. ఆ స్టాక్ గురించి పూర్తిగా అవగాహన చేసి, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
డిప్ సమయంలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణలోకి తీసుకోవాలి.


Click it and Unblock the Notifications