ప్రయివేటురంగ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకు సోమవారం సెషన్‌లో భారీగా నష్టపోయింది. నిన్న ఓ సమయంలో 20 శాతం వరకు క్షీణించి, రూ.130 స్థాయికి పడిపోయిన ఈ స్టాక్ ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటనతో కాస్త కోలుకుంది. ఆర్బీఎల్ బ్యాంకు స్టాక్ నిన్న రూ.31 లేదా 18.10 శాతం క్షీణించి రూ.141.60 వద్ద ముగిసింది. ఆర్బీఎల్ బ్యాంకు డిపాజిటర్లు, ఇతర స్టేక్ హోల్డర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆర్బీఐ హామీ ఇచ్చిన తర్వాత ఈ బ్యాంకు స్టాక్స్ కాస్త కోలుకున్నాయి. అసలు ఈ బ్యాంకులో ఏం జరిగింది, భారీ డిప్ పరిస్థితుల్లో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చా?

ఇదీ జరిగింది
ఆర్బీఎల్ బ్యాంకులో పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐబీఈఏ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. యస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకుల తరహా పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అందులో పేర్కొంది. రిటైల్ రుణాలు, సూక్ష్మరుణాలు, క్రెడిట్ కార్డ్స్‌ను ఆర్బీఎల్ బ్యాంకు అధికంగా మంజూరు చేసిందని, బలహీన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అవి సరిగ్గా వసూలు కావడంలేదని తెలిపింది.
అదే సమయంలో జూన్ నెలలో విశ్వవీర్ అహుజా మరో ఏడాది కాలం పాటు సీఈవోగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఇంకా 6 నెలల కాలం ఉందనగా ఆయన సెలవుపై వెళ్లారు. మరోవైపు కొత్త సీఈవోగా రాజీవ్ అహుజా నియమితులయ్యారు. అదనపు డైరెక్టర్‌గా యోగేష్ కె దయాళ్‌ను ఆర్బీఐ నియమించింది. ఇదంతా గంటల వ్యవధిలో జరిగింది. బ్యాంకు ఆస్తుల నాణ్యతలో సమస్య లేదని, పాలన, ఇతర సమస్యలను చక్కదిద్దుతామని కొత్త సీఈవో రాజీవ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో షేర్లు పతనమయ్యాయి.

భారీగా పతనమై, కాస్త కోలుకొని
షేర్లు 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంది. ఓ దశలో షేర్లు 20 శాతం కంటే పైగా పడిపోయాయి. లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఏదైనా బ్యాంకు వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.
దీంతో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949ను అనుసరించి ఆర్బీఎల్ బోర్డులో అదనపు డైరెక్టర్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఆర్బీఎల్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. డిపాజిటర్లు, వాటాదారుల్లో విశ్వాసం నింపింది. దీంతో స్టాక్ కాస్త పుంజుకుంది. ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఆర్బీఎల్ బ్యాంకులో మూలధన సమస్యలు లేవని, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, ఊహాజనిత వార్తల ఆధారంగా ఆందోళన వద్దని భరోసా కల్పించింది.

స్టాక్ కొనుగోలు చేయవచ్చా?
ఆర్బీఐ భరోసా నేపథ్యంలో ప్రస్తుత డిప్ సమయంలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న ఆర్బీఐ హామీతో కాస్త పుంజుకున్న ఈ స్టాక్ తర్వాత సెషన్‌లలో మరింత లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గతంలో వివిధ బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.215 నుండి రూ.165కు తగ్గించాయి.
అయితే ఈ స్టాక్ కాస్త పుంజుకోవచ్చునని చెబుతున్నారు. స్వల్పకాలానికి, దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చునని అంటున్నారు.అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అన్ని ఆలోచించి, నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి.

నిఫ్టీ నుండి తొలగిస్తారా?
నిఫ్టీ బ్యాంక్ సూచీ నుండి ఆర్బీఎల్ బ్యాంకును తొలగించే అవకాశముందని బ్రోకరేజీ సంస్థ ఎడెల్వెసిస్ సెక్యూరిటీస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం నిఫ్టీ బ్యాంక్ సూచీలో 12 బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంకు వెయిటేజీ తక్కువే. దీని వెయిటేజీ కేవలం 0.75 శాతం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నిఫ్టీ బ్యాంకు నుండి తొలగించవచ్చునని అంచనా వేస్తున్నారు.
2022 ఫిబ్రవరిలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ బ్యాంకు సూచీని సమీక్షించి, ఆర్బీఎల్ బ్యాంకును అందులో నుండి తొలగించొచ్చని, 2022 మార్చి ఆఖరు తేదీన సూచీల్లో మార్పులు చోటుచేసుకుని, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని ఆ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది. అయితే అది జరిగే అవకాశాలు తక్కువ అని కూడా అంటున్నారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications