LIC pension scheme: లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. LIC అనేక పాలసీలు చాలా మెరుగైనవి ఇంకా ఉత్తమమైనవి. ఇక పెన్షన్ సంబంధిత పాలసీ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా LIC ముందంజలో ఉంది. తాజాగా కొత్త జీవన్ శాంతి ప్లాన్ అనే పెన్షన్ పథకాన్నీ వీటిలో చేర్చింది. LIC ఈ పాలసీ పెన్షన్ కోసం బెస్ట్ అప్షన్స్ లో ఒకటి. ఈ పాలసీ ద్వారా మీరు రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత మంచి పెన్షన్ పొందాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటాడు. అలాగే పని చేయకపోయినా 50 లేదా 60 ఏళ్ల తర్వాత అవసరమైన ఖర్చుల కోసం కొంత ఫిక్స్డ్ మొత్తాన్ని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. మీరు రిటైర్మెంట్ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత మంచి జీవితాన్ని లేదా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

LIC పెన్షన్ కోసం చాల పాలసీలు ఉన్నప్పటికీ వీటిలో న్యూ జీవన్ శాంతి ప్లాన్ (LIC new jeevan shanthi plan) చాలా ప్రత్యేకమైనది. ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు ఒక్కసారి మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టాలి. కొంత కాలం తరువాత మీరు మీ జీవితాంతం పెన్షన్‌గా ఫిక్స్డ్ మొత్తాన్ని పొందుతూనే ఉంటారు. అంటే, పదవీ విరమణ తర్వాత కూడా సాధారణ సంపాదన మొదలవుతుందని చెప్పగలం.
ఈ ప్లాన్‌ని ఎవరు తీసుకోవచ్చు?
భారతీయులు ఎవరైనా ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. అది ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా. అయితే దీని కోసం కనీస వయస్సు 30 సంవత్సరాలు, గరిష్టంగా 79 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఈ ప్లాన్‌లో ముందుగానే పెట్టుబడి పెడితే మీకు వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ ప్లాన్ కింద కనీసం రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అంత మొత్తం మీకు పెన్షన్‌గా లభిస్తుంది.
ఈ ప్లాన్ తీసుకునేటప్పుడు మీకు రెండు అప్షన్స్ ఉంటాయి. మొదటి అప్షన్ సింగిల్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీ(deferred annuity). రెండవ అప్షన్ జాయింట్ లైఫ్ వాయిదా వేసిన యాన్యుటీ(deferred annuity). మీరు రెండు అప్షన్స్ లో దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీకు ఎప్పుడు, ఎంత పెన్షన్ వస్తుంది?
ఈ పాలసీలో పెట్టుబడి పెట్టిన 5 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. మీ వయస్సు 40 ఏళ్లు అయితే 45 ఏళ్ల నుంచి పెన్షన్ ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ వయస్సు 55 ఏళ్లు అయితే 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ పెన్షన్ జీవితాంతం అందుబాటులో ఉంటుంది.
ఇలా చేస్తే లక్ష రూపాయల పెన్షన్
ఉదాహరణకు మీ వయస్సు 45 సంవత్సరాలు అనుకుందాం. మీరు ఈ పాలసీలో రూ.11 లక్షలను ఒకే ప్రీమియంగా పెట్టుబడి పెట్టండి. మీ పెన్షన్ 5 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది, అంటే మీకు 50 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు సంవత్సరానికి సుమారు రూ. 1 లక్ష వరకు(రూ. 99,440) పెన్షన్ పొందుతారు.
ఇప్పుడు మీరు ఈ ప్లాన్‌ని 55 ఏళ్ల వయస్సులో కొనుగోలు చేశారని ఊహించుకుందాం. మీరు సింగిల్ ప్రీమియం కింద రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 5 సంవత్సరాల తర్వాత మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడు మీ పెన్షన్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మీకు జీవితాంతం పెన్షన్‌గా ఏడాదికి రూ.1,02,850 లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌లో ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకోసారి లేదా ప్రతి 6 నెలలకోసారి కూడా పెన్షన్ తీసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications