For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ కావాలంటే? వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, రీ-ఇన్వెస్ట్‌మెంట్ అదుర్స్!

|

కరోనా మహమ్మారి తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాదిన్నరగా రిటైల్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం పెరుగుతోంది. ఇటీవల ఆర్థిక రికవరీ, జనసమూహం సాధారణంగా మారుతున్న నేపథ్యంలో కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా ముందుస్థాయితో పోలిస్తే రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, అది సురక్షిత, గ్యారెంటీ పెట్టుబడి.

కానీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ పండ్స్ పెట్టుబడులు అసురక్షితం. భారీ లాభాలు రావొచ్చు.. లేదా ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెద్ద దెబ్బ తగలవచ్చు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

అలాంటి పెట్టుబడి భేష్

అలాంటి పెట్టుబడి భేష్

మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయగానే రిటర్న్స్ ప్రారంభం కావు! మీ ఇన్వెస్ట్‌మెంట్ సరైన విధంగా ఉంటే మల్టీ బ్లాగర్ రాబడిని సాధించవచ్చు. పెట్టుబడి నిర్ణయంలో తొందరపడవద్దు. సానుకూల రాబడి కోసం చాలా కాలం వేచి ఉండవలసి వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు ఎప్పుడు వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ను రికమండ్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఇన్వెస్టర్లు అన్ని అంశాలను పరిశీలించాలి.

ప్రముఖ పెట్టుబడిదారు గ్లెన్ గ్రీన్ బర్గ్ ప్రకారం ప్రస్తుతం అంతగా ఖరీదైనది కానీ, అలాగే రాబోయే కాలంలో మంచి వృద్ధిని సాధించే కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించాలి. నిపుణుల సలహాలు, ఆయా స్టాక్స్, రంగాలపై లోతైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

కంపెనీ చరిత్ర, నిపుణుల సలహా

కంపెనీ చరిత్ర, నిపుణుల సలహా

మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆ కంపెనీ హిస్టరీ తెలుసుకోవాలి. సదరు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే మీ విశ్వాసం సన్నగిల్లవచ్చు. కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని, మనకు యాప్ట్ కాదనిపించిన పక్షంలో పెట్టుబడికి దూరంగా ఉండగలం. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటే ఏ కంపెనీ బిజినెస్ మోడల్ బాగుంది, బిజినెస్ బాగుందో చెప్పగలరు. అలాగే, మనం కూడా సొంతగా కంపెనీ గురించి తెలుసుకోవాలి.

అధిక రిటర్న్స్, తక్కువ రిస్క్

అధిక రిటర్న్స్, తక్కువ రిస్క్

ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఎక్కువ రిటర్న్స్, తక్కువ రిస్క్ ఉండే కంపెనీని ఎంచుకోవడం సముచితం.

పెట్టుబడికి సంబంధించి మంచి రిటర్న్స్ కోసం రీ-ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం. మీరు ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ వస్తే వాటిని వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ తక్కువ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఇలా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందవచ్చు.

మీకు తెలిసిన బిజినెస్‌లో...

మీకు తెలిసిన బిజినెస్‌లో...

మీకు తెలిసిన, అర్థం చేసుకున్న వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే వ్యాపారం గురించి మీకు తెలియకుంటే మీరు సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ అయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఆయా రంగాల గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి.

మార్కెట్ నుండి అత్యంత భారీ రిటర్న్స్ ఆశించడం సరికాదు. లాభనష్టాలకు సిద్ధపడి ఇన్వెస్ట్ చేయడం మంచిది.

English summary

సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ కావాలంటే? వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, రీ-ఇన్వెస్ట్‌మెంట్ అదుర్స్! | Do you invest in the stock market? Know these special things of a successful investor

Invest in share market for long term. If you reinvest the returns as investment, your returns will prove to be multibagger in the long run.
Story first published: Sunday, December 26, 2021, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X