For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ క్రెడిట్ స్కోర్ బాగోలేదా... అయితే చింతించకండి.. మీకు రుణం లభించే మార్గాలున్నాయ్...

|

బ్యాంకు లేదా వేరే ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందాలంటే వారు ముందు చూసేది మీకు సంబందించిన క్రెడిట్ స్కోర్ అన్న విషయం తెలిసిందే. క్రెడిట్ స్కోర్ తగిన స్థాయిలో లేకపోతే బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రావు. ఒక వేళ రుణం ఇవ్వాలని నిర్ణయించినా మీకు చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంతకు ముందు తీసుకున్న రుణాన్ని సరిగ్గా చెల్లించక పోవడమే కారణం. మీరు చేసిన పొరపాటు వల్లనే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని రుణం పుట్టలేని పరిస్థితి ఎదురవుతుందన్నమాట. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నదంటే మీరు ఎక్కు వ రిస్క్ ఉండే రుణగ్రహీత అన్నట్టు.

ఇవీ కారణాలు..

ఇవీ కారణాలు..

* బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు ఆ రుణ వాయిదాలను తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం చేయవద్దు. మీరు మరచి పోయి రుణ వాయిదాను చెల్లించకపోయినా.. తెలిసి చెల్లించలేక పోయినా అది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావాన్ని చూపుతుంది

* కొంత మంది తమ వద్ద ఉన్న క్రెడిట్ కార్డు ను విచ్చల విడిగా వాడతారు. క్రెడిట్ కార్డు పై ఇచ్చిన మొత్తం పరిమితిని వినియోగిస్తారు. దీని వల్ల మీరు క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుంది.

* తక్కువ సమయంలో ఎక్కువగా రుణ దరఖాస్తులు చేయడం. దీనివల్ల మీరు రుణం కోసం వెంపర్లాడుతున్నట్టు తెలిసిపోతుంది.

* రుణం ఇవ్వడానికి క్రెడిట్ స్కోర్ కీలకం కాబట్టి ఈ స్కోర్ బాగోలేకుంటే మీరు బ్యాంకు రుణాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

* అయితే మీరు క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణం రానట్టయితే మీరు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. వాటి గురించి చూద్దాం.

బంగారం...

బంగారం...

* మీ వద్ద బంగారం ఉంటే అది మీరు రుణం పొందడానికి దోహదపడుతుంది.

* బ్యాంకులతో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు కూడా బంగారం పై రుణాన్ని ఇస్తున్నాయి. ఈ రుణాలను తక్షణమే తీసుకోవచ్చు. వడ్డీ రేటు కాస్త ఎక్కువ ఉండవచ్చు.

* ఈ రుణాన్ని ఎప్పుడంటే అప్పుడు తీర్చి వేసి ఆభరణాలు తీసుకోవచ్చు.

ఆస్తులపై...

ఆస్తులపై...

* మీవద్ద స్థిరాస్థులు ఏమైనా ఉంటే వాటిని బ్యాంకులవద్ద తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తో పని ఏమీ ఉండదు.

* స్థిరాస్థులతో పాటు మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మీ స్టాక్ మార్కెట్ షేర్లు వంటి వాటిని తనఖా పెట్టి కూడా రుణాన్ని తీసుకోవచ్చు.

* అయితే మీరు తనఖా పెట్టే ఆస్థి విలువ ఎంత ఉంటుందో అంత మేరకు మీరు రుణం ఇవ్వరు. వడ్డీ రేటు కాస్త ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది.

పీర్ టు పీర్ ...

పీర్ టు పీర్ ...

* ఈ విధానంలో రుణం పొందడం చాలా సులభం. ఈ రుణాలకు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

* ఇందులో కూడా క్రెడిట్ స్కోర్ ను చూస్తారు. అయితే స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కలిసి...

కుటుంబ సభ్యులతో కలిసి...

* మీ క్రెడిట్ స్కోర్ బాగోలేకుంటే ఒక పని చేయాలి. మీ కుటుంబ సభ్యులను కూడా మీ రుణ దరఖాస్తులో చేర్చుకోండి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ.. మీ సహా దరఖాస్తు దారు మూలంగా మీకు రుణం లభించడానికి అవకాశం ఉంటుంది.

English summary

మీ క్రెడిట్ స్కోర్ బాగోలేదా... అయితే చింతించకండి.. మీకు రుణం లభించే మార్గాలున్నాయ్... | Do you have bad credit score? still you can get loan

If you have bad credit score getting loan from a bank will be difficult. But you have the alternates to get bank loan. Gold, assets, bank fixed deposits, peer to peer lending, co applicant etc are the other alternatives to get loan.
Story first published: Tuesday, December 17, 2019, 7:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X