FD Vs RBI Bonds: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వచ్చే పథకం ఇదే..!
డబ్బు సంపాదించడమే కాదు.. భవిష్యత్ కోసం భరోసా పెట్టుబడి కూడా పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ కొద్ది రోజుల ముందు, రిటైర్మెంట్ అయిన తర్వాత కచ్చితమైన రాబడి కోసం పెట్టుబడి పెట్టాలని చెబుతున్నారు. సురక్షితమైన పెట్టుబడి అనగానే.. మనకు గుర్తొచ్చేదు బ్యాంక్ ఎఫ్డీలు, పోస్టాఫీస్ పథకాలు. ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే సురక్షితమైన, కచ్చితమైన రాబడి వస్తుంది. అయితే వీటితో పాటు మరో పెట్టుబడి పథకం ఉంది. అవే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు. వీటిలో కూడా కచ్చితమైన హామీతో కూడిన రాబడి పొందవచ్చు.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల వడ్డీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటుతో సంబంధం ఉంటుంది. ఎప్పుడైనా.. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేట్లు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు కంటే 0.35 శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేట్ 7.7 శాతంగా ఉంది. అంటే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎన్ఎస్సీ వడ్డీ రేట్లు మారుతాయో.. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేట్లు మారుతాయని గుర్తుంచుకోవాలి. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

గరిష్ట పరిమితికి పరిమితి లేదు. అయితే ఇందులో లాగిన్ పీరియడ్ ఉంటుంది. సాధారణ పెట్టుబడిదారులకు 8 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఒక్కసారి ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి పెడితే మధ్యలో ఉపసంహరించుకోవడానికి అవకాశం లేదు. ఇందులో 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ తో బ్యాంకుల ఫిక్స్ డ్ డపాజిట్ పరిశీలిస్తే.. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఐదేళ్ల డిపాజిట్ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పరిశీలిస్తే.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.35 శాతం, ఎస్బీఐలో 6.05 శాతం, కెనరా బ్యాంకులో 6.25 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6 శాతంగా ఉంది.
అంటే.. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో ఎక్కువ వడ్డీ రేటు వర్కవుట్ అవుతుంది. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలంటే..ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా లేదా ఏదైనా గుర్తింపు బ్యాంకులో మీకు ఇప్పటికే ఉన్న నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ అవసరం పడుతుంది. అయితే ఆర్థిక నిపుణుల సలహా మేరకు పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications