తెలుగు రాష్ట్రాల నుండి దివిస్ అరుదైన ఘనత: 17 ఏళ్ళ క్రితం రూ.130 ఇన్వెస్ట్ చేస్తే...

ముంబై: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్స్ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ షేర్ నిన్న రూ.3,825 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.3,848తో జీవనకాల గరిష్టాన్ని తాకింది. నేడు ప్రారంభ సెషన్లోను 0.33 శాతం లాభపడి రూ.3,837 వద్ద ప్రారంభమైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.1 లక్ష కోట్లు దాటింది. ఈ ఏడాది (2020 క్యాలెండర్ ఏడాది) స్టాక్ రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాల నుండి అరుదైన ఘనత

తెలుగు రాష్ట్రాల నుండి అరుదైన ఘనత

ఈ షేర్ ధర రూ.3,832 వద్ద దివిస్ ల్యాబ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,674 కోట్లను క్రాస్ చేసింది. దీంతో కంపెనీ వాటాదారుల భారీ రిటర్న్స్ వచ్చినట్లు అయింది. తెలుగు రాష్ట్రాల నుండి ఇలాంటి అరుదైన ఘనత సాధించిన కంపెనీ ఇదే. దేశంలో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన రెండో ఫార్మా కంపెనీగా నిలిచింది. అంతకుముందు సన్ ఫార్మా మార్కును క్రాస్ చేసింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి దివిస్ కంపెనీ స్టాక్ రూ.101556.33 కోట్లుగా ఉంది. సన్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.137082.62 కోట్లుగా ఉంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో దివిస్ 30వ స్థానంలో ఉంది.

ఒంటిమామిడిలో ప్రాజెక్టు

ఒంటిమామిడిలో ప్రాజెక్టు

2020 క్యాలెండర్ ఏడాదిలో దివిస్ ల్యాబ్స్ స్టాక్ భారీగా ఎగిసింది. జనవరి నుండి ఇప్పటి వరకు 109 శాతం లాభపడింది. అదే సమయంలో ఈ ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ 13 శాతం లాభపడగా, బీఎస్ఈ హెల్త్ కేర్ సూచీ 60 శాతం లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్స్ డిసెంబర్ 1న ఒంటిమామిడి, కోనా ఫారెస్ట్ (ఆంధ్రప్రదేశ్)లో యూనిట్ III ఫెసిలిటీ(ప్రాజెక్టు)ను ప్రకటించింది. ఇక్కడ రూ.1500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ఇక్కడ కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

దివిస్‌కు ఇవి ప్లస్

దివిస్‌కు ఇవి ప్లస్

జనరిక్ ఏపీఐల ఉత్పత్తిలో కంపెనీ ప్రపంచంలోని మేటి కంపెనీల్లో దివిస్ ఒకటి. అలాగే ఇటీవల పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. కంపెనీకి రుణాల బాధ లేదు. విస్తరణకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటోంది. కంపెనీకి చెందిన ఏ ప్లాంటుకు ఎఫ్‌డీఏ వంటి రెగ్యులేటరీ సంస్థల నుంచి అభ్యంతరాలులేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి ఏకీకృత ఖాతాల ప్రకారం దివిస్ ల్యాబ్స్ రూ.3506 కోట్ల మొత్తం ఆధాయాన్ని, రూ.1012 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

17 ఏళ్ల క్రితం ఒక షేర్ కొంటే..

17 ఏళ్ల క్రితం ఒక షేర్ కొంటే..

ఈ ఏడాదిలో దివిస్ ల్యాబ్ షేర్లు 109 శాతం లాభపడ్డాయి. 2020 ప్రారంభంలో రూ.1860 వద్ద ఉన్న స్టాక్ ఇప్పుడు రూ.3800కు చేరుకుంది. దివిస్ 2003 ఫిబ్రవరిలో ఐపీవోకు వచ్చింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.130 జారీ చేసింది. 2007లో రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విభజించింది. 2003లో కొనుగోలు చేసిన ఒక షేరు 5 షేర్లుగా మారింది. 2009లో బోనస్ షేర్లను జారీ చేసింది. మొత్తంగా 2003లో ఒక షేరు కొనుగోలు చేసినవారికి ఇప్పుడు 20 షేర్లు అయినట్లు. ఇప్పుడు ఒక షేర్ రూ.3800గా ఉంది. అంటే వారు రిటర్న్స్ భారీగా ఉన్నట్లు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+