ప్రభుత్వరంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పోరేషన్(BPCL) ప్రయివేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. BPCLలో తనకు ఉన్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రయివేటీకరించే కసరత్తులో ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం వాటాలు ఉన్నాయి బీపీసీఎల్‌కు. ప్రస్తుతం అందరి దృష్టి బీపీసీఎల్ పైన ఉంది. ఈ స్టాక్ ఇప్పుడు రెండు అంశాలను కలిగి ఉంది. ఒకటి పెట్టుబడుల ఉపసంహరణ (డిస్‌ఇన్వెస్ట్‌మెంట్), రెండోది డివిడెండ్. ఇది రాబోయే కొద్ది రోజుల్లో జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ స్టాక్స్ పైన బ్రోకరేజీ సంస్థలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం...

రూ.448 కొనుగోలు చేస్తే
బీపీసీఎల్ షేర్ ధర ప్రస్తుతం రూ.450 వద్ద ఉంది. స్టాక్‌కు రూ.58 డివిడెండ్ ఉంది. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించిన రికార్డ్ డివిడెండ్. మీరు బీపీసీఎల్ వాటాను ప్రస్తుత మార్కెట్ ధర రూ.450 వద్ద కొనుగోలు చేసి, సెప్టెంబర్ వరకు స్టాక్స్ కలిగి ఉందనుకుంటే, అప్పుడు మీ స్టాక్ ఖర్చు రూ.392 మాత్రమే అవుతుంది. డివిడెండ్ యీల్డ్స్ ఇప్పుడు పెరుగుతాయి. అయితే వచ్చే ఏడాది డివిడెండ్ ప్రకటించే అవకాశం లేదు. మీరు ప్రతి సంవత్సరం రెగ్యులర్ డివిడెండ్ కోసం స్టాక్ కొనుగోలు చేస్తే, ఈ ఏడాది కూడా మరిచిపోవద్దని సూచిస్తున్నారు. ఇక్కడ విషయం ఏమంటే మీరు షేర్ కొనుగోలు ద్వారా డివిడెండ్ వస్తే అప్పుడు మీరు షేర్ కొనుగోలుకు చేసిన ఖర్చు రూ.392 మాత్రమే అవుతుంది. అంటే బీపీసీఎల్ షేర్ కొనుగోలు మంచిదిగా చెప్పవచ్చు. డివిడెండ్ ఎప్పుడు జమ చేస్తారనే విషయం తెలియనప్పటికీ, సెప్టెంబర్ చివరలో ఉండవచ్చునని అంటున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వాటాను పూర్తిగా విక్రయిస్తుంది. వచ్చే ఏడాది మార్చిలోపు ఇది పూర్తి కావొచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా బీపీసీఎల్‌ను విక్రయించనున్నట్లు దీపమ్ (డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ అంశం అంటే ప్రయివేటీకరణ కూడా ఈ స్టాక్ కొనుగోలుకు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.

ఈ రెండింటి ద్వారా..
టాప్ బ్రోకరేజీ సంస్థలు ఐసీఐసీఐ డైరెక్ట్, మోతీలాల్ ఓస్వాల్ కూడా ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నాయి. బీపీసీఎల్ అంచనాలు మించి లాభాలు నమోదు చేసింది. బెట్టర్ మార్కెటింగ్ వ్యాల్యూమ్, రిఫైనింగ్/మార్కెటింగ్ మార్జిన్స్ ద్వారా ఇది సాధ్యమైంది. లాభాలు కూడా ఇందుక కారణమయ్యాయి. FY21లో ప్రయివేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు పెరిగాయి. అదే స్థాయిలో బీపీసీఎల్ స్టాక్ వేగం లేదు. పైగా ఇప్పుడు ఈ షేర్ రూ.450కి పడిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ, డివిడెండ్ వంటి అంశాల ఆధారంగా బీపీసీఎల్ స్టాక్ కొనుగోలుకు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్న అంశం. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాసం ఆధారంగా పెట్టుబడులు సరికాదు. నిపుణుల సలహాలు, స్టాక్ గురించి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications