PPF vs VPF: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సుమారుగా ఇంకో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పన్ను మినహాయింపులు పొందేందుకు ఆయా ఉత్పత్తుల్లో పెట్టుడులు పెట్టేందుకు త్వరపడుతున్నారు. దీర్ఘకాలంలో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే ఎంపికలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈమధ్య ఉద్యోగాలు చేస్తున్న యువత జీవిత చరమాంకంలో ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఎక్కువగా ప్రణాళికలు రచిస్తున్నారు. పన్ను మినహాయింపు కూడా కలిసి రావడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) వంటి రిటైర్మెంట్ ప్లాన్స్ వైపు చూస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

PPF అనే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను భారతీయులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. కేవలం రూ.100 తో ఖాతా తెరవవచ్చు కానీ ఓ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంంది. గరిష్ఠంగా ఓ ఏడాదిలో 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని వ్యవధి 15 ఏళ్లు కాగా తర్వాత ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లు అయినా పొడింగించే అవకాశం ఉంది. ఈ ఏడాది 7.15 శాతం వడ్డీ లభిస్తుంది.
VPF అనేది PPFకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో కేవలం ఉద్యోగస్తులు అదికూడా EPF చెల్లిస్తున్న సభ్యులు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. ఇందులో కనీస మొత్తం లేదా వార్షిక పెట్టుబడి వంటివి ఉండవు. బేసిక్ జీతంలో 100 శాతం వరకు ఐచ్ఛికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక్కడ ప్రస్తుతం EPFతో సమానంగా 8.25 శాతం వడ్డీ పొందవచ్చు.
PPF పెట్టుబడులు EEE కేటగిరీ కిందకు వస్తాయి. అంటే 1.5 లక్షల వరకు అసలు, వడ్డీ సహా మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. EPF మరియు VPF మొత్తం కలిపి 2.5 లక్షల వరకు వడ్డీ పైన సైతం ట్యాక్స్ విధించరు. ఆపై మొత్తానికి మాత్రం పన్నుపోటు తప్పదు. ఇక ఉపసంహరణ విషయానికి వస్తే ఐదేళ్ల తర్వాత PPFను పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు అయితే రెండు నెలలపాటు నిరుద్యోగిగా ఉంటే VPF మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications