క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? కరోనా లాక్ డౌన్ సమయంలో క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన మారటోరియం వాడుకున్నారా? అయితే ఇక మీకు ఆ ఇబ్బంది తప్పదు అంటున్నాయి చాలా బ్యాంకులు . ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో అవకాశం దొరికింది కదా అని మారటోరియంను వాడుకుని క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయి.

మారటోరియం వాడుకుంటే క్రెడిట్ కార్డు లిమిట్ హుష్ కాకి
ఒక రెండు మూడు నెలలు పని చెయ్యనంత మాత్రాన బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మారటోరియం ఎంచక్కా వినియోగించుకున్న వారి క్రెడిట్ కార్డుల లిమిట్ ను తగ్గించనున్నాయి పలు బ్యాంకులు . దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మారిటోరియం ఆప్షన్ ను ఎంచుకున్న వినియోగదారులు హమ్మయ్య మూడు నెలల పాటు చెల్లించాల్సిన అవసరం లేదు అని ఊపిరి తీసుకుంటే బ్యాంకులు మాత్రం వారి క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించి షాక్ ఇచ్చే పనిలో ఉన్నాయి .

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో క్రెడిట్ కార్డుల బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలు చెల్లించని కస్టమర్లు
దేశంలో కరోనాను నియంత్రించటానికి కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, పలు సంస్థలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయి ఉన్నారు . ఇక చాలా మందికి జీతాలు ,వేతనాలు కూడా రాని పరిస్థితి . అయితే వారికి రావలసిన వేతనం రాకపోవడంతో చాలా మంది క్రెడిట్ కార్డుల బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇక వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడునెలలు బిల్లును మారిటోరియం చేసుకునే వెసులుబాటును కల్పించింది.

కొంప ముంచిన మారటోరియం ఆప్షన్ ఎంపిక .. బాగా తగ్గిన క్రెడిట్ కార్డ్ లిమిట్
ఇక మారటోరియం ఆప్షన్ ను ఎంచుకోవడం వలన వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ బాగా తగ్గిపోయిందని పలువురు లబోదిబోమంటున్నారు . అంటే క్రెడిట్ కార్డులో రూ.2,00,000 లిమిట్ ఉంటే అది కాస్తా రూ.40,000 వరకు తగ్గిపోయింది. దాదాపు 80% కూడా క్రెడిట్ లిమిట్ తగ్గించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితిలో ఆర్‌బీఐ కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆర్ధిక వ్యవస్థ మీద ఉండటంతో ఈ మారటోరియం ఆప్షన్‌ను తెరపైకి తీసుకువచ్చింది.

మారటోరియం ఎంచుకోవడం వలన వినియోగదారులకు నష్టాలే
ఇక దీన్ని వాడుకున్న వాళ్ళ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేస్తున్న బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్ ను దారుణంగా తగ్గిస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఈ ఆప్షన్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక ఈ మారటోరియం ఎంచుకోవడం వలన వినియోగదారులకు నష్టాలే అధికంగా ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లులు , ఈఎంఐలు కట్టగల ఆర్ధిక స్థోమత ఉన్నవారు చెల్లిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇక అవకాశం దొరికింది కదా అని అందరూ ఈ ఆప్షన్ వాడుకున్నారు. ఫలితంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గటానికి వారే కారణం అయ్యారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications