Home Loan: తక్కువ వడ్డీకే హోం లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
చాలా మందికి సొంతిల్లు కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ చాలా తక్కువ మందే ఇళ్లను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తున్నవారిలో ఎక్కువ మంది హోం లోన్లు తీసుకుంటారు. అయితే ఏ బ్యాంకు తక్కువ వడ్డీకే గృహ రుణం అందిస్తోందో తెలుసుకుందాం.. స్థిర లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటు గృహ రుణం కోసం చూస్తున్న గృహ కొనుగోలుదారులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకుల కోసం చూస్తారు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వడ్డీ రేటులో చిన్న తేడా కూడా మొత్తం రుణ కాలంలో చెల్లించే వడ్డీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. గృహ రుణ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) అనేది, రుణగ్రహీత రుణం అసలు, వడ్డీ రెండింటినీ తిరిగి చెల్లించడానికి చేసే నెలవారీ చెల్లింపు.
వడ్డీ రేటులో చిన్న మార్పు కూడా EMI చెల్లింపుపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి గృహ రుణగ్రహీతలు వివిధ బ్యాంకులు అందించే తాజా వడ్డీ రేటును తప్పకుండా తెలుసుకోవాలి. ఉదాహరణకు, 30 సంవత్సరాల కాలానికి రూ. 50 లక్షల స్థిర వడ్డీ రేటు రుణం కోసం వడ్డీ రేటు 7% కి బదులుగా 8% ఉంటే, రుణగ్రహీత దాదాపుగా రూ. 12.32 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే తక్కువ వడ్డీకే హోం లోన్ తీసుకోవాలి. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉన్న రుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అందించే అత్యల్ప గృహ రుణ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉన్న రుణాలపై 7 శాతం అత్యల్ప గృహ రుణ వడ్డీ రేటును అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోం లోన్ పై వడ్డీ రేటు 7 నుంచి 9.90 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.00% నుండి 9.15% వరకు వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10 శాతం నుంచి 10 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం నుంచి 9.55 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుండగా.. యూకో బ్యాంక్ 7.15 శాతం నుంచి 9.25 శాతం వరకు రేట్లను అందిస్తున్నాయి.
ప్రైవేట్ రంగ బ్యాంకులలో, సౌత్ ఇండియన్ బ్యాంక్ 7.25 శాతంతో అత్యల్ప గృహ రుణ వడ్డీ రేటును అందిస్తుండగా.. దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్ 7.35 శాతంతో ఉంది. హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ 7.45 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. కర్ణాటక బ్యాంక్ రేట్లు 7.48% నుంచి ప్రారంభమవుతాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. ఒక వ్యక్తికి ఆర్థిక రంగంలో క్రెడిట్ స్కోర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ రోజుల్లో తక్కువ వడ్డీ రేటుకు రుణం తీసుకోవడానికి మంచి క్రెడిట్ స్కోర్ చాలా అవసరం.
గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల రుణ అర్హతను, వారు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించే అవకాశాన్ని అంచనా వేయడానికి క్రెడిట్ స్కోర్‌ను ఉపయోగిస్తారు. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, ఇతర అంశాలపై ఆధారపడి, గృహ రుణ వడ్డీ రేట్లు మారుతుంటాయి. రుణగ్రహీతకు అందించే వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు బ్యాంకులు ఆదాయం, రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితి, ఉద్యోగ వివరాలు, ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల ఒక బ్యాంకు ప్రకటించిన రేటు ప్రతి గృహ రుణ దరఖాస్తుదారునికి వర్తించే రేటు కాకపోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications