రిటైర్మెంట్‌కు ముందు ఇలా ప్లాన్ చేసుకోండి, మీ మూడు చూడండి
మీరు పదవీ విరమణ గురించి ఆలోచిస్తున్నారా? మీరు జీవించడానికి తగినంత డబ్బును కలిగి ఉండేందుకు, మీ భవిష్యత్తు రిటైర్మెంట్ భద్రతను ప్రమాదంలో పడకుండా చూసుకోవడానికి మీరు ముందుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. జీవితంలో పర్సనల్ ఫైనాన్సింగ్ చాలా ముఖ్యం. అదే సమయంలో రిటైర్మెంట్ జీవితం కోసం కూడా మొదటి నుండి ప్లాన్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టింది. కరోనా తర్వాత హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్‌తో పాటు భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడం అందరిలోను పెరిగింది.

మీ రిటైర్మెంట్ అమౌంట్ కోసం...
మీ పెట్టుబడి ఖాతాలను బట్టి మీ రిటైర్మెంట్ రిటర్న్స్ ఎంత వస్తాయో ఓ అంచనాకు రావొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం, మీ ఉపసంహరణ రేటు అనే రెండు అంశాలు ముఖ్యం.
మీ వేతనం నుండి రిటైర్మెంట్ కోసం చేసే సేవింగ్స్ తక్కువగా ఉంటే చివరకు రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేవింగ్స్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అధిక మొత్తంలో సేవింగ్స్ మీకు తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ చిన్న చిన్న మొత్తాలతో చివరకు పెద్ద మొత్తం చేతికి వస్తుంది.

మీ పదవీ విరమణ గమ్యం.. ఆర్థిక స్థితిపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జీవన వ్యయంలో మార్పు వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సామాజిక భద్రతా ప్రయోజనాలపై పన్ను విధిస్తుండగా, మరికొందరు ఆదాయపు పన్ను విధించకుండా పన్ను నియామాలు విభిన్నంగా ఉంటాయి. మీరు నివసించే ఇల్లు లేదా అపార్టుమెంట్ మీ ఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఈ ఖర్చులు మీ రిటైర్మెంట్ సేవింగ్స్ పైన ప్రభావం చూపవచ్చు. ఖరీదైన నగరాలు, ఇళ్లలో నివసిస్తే ఖర్చు పెరుగుతుంది కాబట్టి సేవింగ్స్ తగ్గుతాయి. తక్కువ ఖరీదు నగరాలు ఇంటిలో నివసిస్తే కాస్త ఎక్కువ సేవింగ్స్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

పార్ట్ టైమ్ చేస్తే...
మీ అలవాట్లు కూడా మీ ఖర్చు పైన ప్రభావం చూపుతాయి. అలాగే, మీరు అదనపు డబ్బు కోసం పార్ట్ టైమ్ వర్క్ చేయాలని ప్లాన్ చేస్తే కాస్త ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు. పదవీ విరమణ కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications