స్టాక్ మార్కెట్లు ఎప్పటికప్పుడు భారీ లాభాల్లో ముగుస్తున్నాయి. సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. నేడు సెన్సెక్స్ ఏకంగా 56,000 పాయింట్లను దాటింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 47,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఇప్పుడు 56,000 పాయింట్లకు దగ్గరగా ఉంది. అంటే ఈ తక్కువ కాలంలోనే దాదాపు 10,000 పాయింట్లు లాభపడింది. అయితే గత ఏడాది కరోనా వేవ్ అనంతరం సూచీలు 54,000 పాయింట్ల సమీపానికి వచ్చి సెకండ్ వేవ్ తర్వాత నష్టపోయాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉంన్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది లేదు. కానీ స్వల్పకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మార్కెట్లు ఎప్పుడైనా కరెక్షన్‌కు గురి కావొచ్చు లేదా కరోనా వంటి అనుకోని పరిస్థితుల్లో భారీగా పతనం కావొచ్చు. లేదా అన్ని సానుకూలంగా ఉంటే ఇలాగే పరుగు పెట్టవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించాలి.

భారీ లాభాలు కష్టమేనా?
ప్రస్తుతం సూచీలు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్న నేపథ్యంలో స్వల్ప కాలానికి ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ సానుకూలంగా ఉన్నప్పటికీ భారీ లాభాలు అందిపుచ్చుకోవడం అంత సులభంకాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక దిద్దుబాటుకు గురైనా లేదా అనుకోని పరిస్థితుల్లో పతనమైనా నష్టం తప్పదని చెబుతున్నారు. అలా కాకుంటే ర్యాలీ ఉన్నా కూడా ఇక ముందు భారీగా ఉండకపోవచ్చునని, కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే అధిక రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 ఇండెక్స్ 2020 మార్చి నాటితో పోలిస్తే దాదాపు డబుల్ ఎగిసిపడింది. కరోనా ప్రభావం, కఠిన ఆంక్షలు, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, కేంద్ర బ్యాంకు నుండి నిధుల ప్రవాహం, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు భారీగా ఎగిసిపడ్డాయి.

మిడ్ క్యాప్ సూచీలు
జూలై చివరి నుండి రెడ్ హాట్ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు కాస్త క్షీణించాయి. అయితే హెవీ వెయిట్స్ మాత్రమే లార్జ్ క్యాప్ ర్యాలీని సజీవంగా ఉంచుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని పది స్టాక్స్ గత నెల రోజుల్లో భారీగా ఎగిసిపడగా, 190 స్టాక్స్ దాదాపు ఏడు శాతం చొప్పున లాభపడ్డాయి. ఆగస్ట్ నెలలో ఎన్ఎస్ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మాత్రం 8.6 శాతం క్షీణించింది. అక్టోబర్ నెల నుండి ఓ నెలలో ఇవి క్షీణించడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ 3.1 శాతం నష్టపోయింది.

సన్నగిల్లుతున్న ర్యాలీ
ఇటీవల మరో ఆందోళన కలిగించే అంశం ర్యాలీ సన్నగిల్లుతోంది. నిఫ్టీ 200 సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. కానీ ఎక్కువ స్టాక్స్ 50 రోజుల కదిలే సగటు జూన్ నెలలోదాదాపు 100 శాతం నుండి 45 శాతానికి పడిపోయింది. జూలై నెలతో పోలిస్తే గ్రాస్ మార్కెట్ వ్యాల్యూమ్ కూడా క్షీణించింది. మిడ్ క్యాప్స్ కంటే లార్జ్ క్యాప్స్ ఫ్లో ఎక్కువగా ఉంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications