SBI కస్టమర్లకు హెచ్చరిక: వెంటనే ఈ పని పూర్తి చేయండి, లేదంటే డబ్బులు తీసుకోలేరు!
ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ కలిగి ఉండి kYC (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయని వారు ఇక నుండిబ్యాంకు అకౌంట్ ద్వారా సేవలు పొందలేరు. బ్యాంకు సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఫిబ్రవరి 28వ తేదీలోపు KYCని పూర్తి చేయాలని ఎస్బీఐ తమ కస్టమర్లకు సూచించింది.

డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కుదరదు..
ఎస్బీఐ గతంలోనే KYC ప్రక్రియను పూర్తి చేయాలని కస్టమర్లను కోరింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే ఆ పనిని పూర్తి చేసుకోవాలని సూచించింది. KYCని పూర్తి చేయకుంటే అకౌంట్‌ను స్తంభింప చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో KYC పూర్తి చేయకుంటే డబ్బులు కూడా విత్ డ్రా చేసుకోవడం కుదరదు.

అవసరమైన డాక్యుమెంట్లతో KYC అప్ డేట్
RBI సూచనల మేరకు ఫిబ్రవరి 28వ తేదీలోపు అన్ని బ్యాంకులు కూడా కస్టమర్ల KYCని అప్ డేట్ చేయాలి. ఎస్బీఐ కస్టమర్లు KYC వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు బ్రాంచీకి వెళ్లాలి. అవసరమైన డాక్యుమెంట్స్ బ్యాంకుకు ఇవ్వవలసి ఉంటుంది.

నెట్ బ్యాంక్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగిన కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా KYCని అప్ డేట్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ యాక్సెప్ట్ చేసే డాక్యుమెంట్లు
KYC పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, కరెంట్/టెలిఫోన్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ పే ఆర్డర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, సేల్ డీట్, లీజ్ అగ్రిమెంట్, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డు తదితర డాక్యుమెంట్స్ ఏవైనా ఇస్తే సరిపోతుంది. ఎస్బీఐ వీటిని అన్నింటిని యాక్సెప్ట్ చేస్తుంది.

వెంటనే పూర్తి చేయండి
మీరు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయితే, మీ అకౌంట్ ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే మొదట KYCని పూర్తి చేయాలి. పైన చెప్పిన విధంగా... అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్‌తో బ్యాంకుకు వెళ్లి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేయవచ్చు. KYC పూర్తి చేయకుంటే మీ ఖాతా నుండి నిధులు ఉపసంహరించుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఇది మార్చి 1 నుండే ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications