కార్పోరేట్ కంపెనీలు అప్పుడప్పుడు షేర్ బైబ్యాక్‌ను ప్రకటిస్తాయి. లిస్టెడ్ కంపెనీలు తమ ఫ్లోటెడ్ సెక్యూరిటీస్‌ను తిరిగి కొనుగోలు చేయడం ద్వారా తమ వాటాదారులకు విలువైన రిటర్న్స్‌ను అందిస్తాయి. ఇటీవల టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోలు బైబ్యాక్‌ను ప్రకటించాయి. వివిధ లిస్టింగ్ కంపెనీలు బైబ్యాక్ ఆఫర్ ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాబోయే బైబ్యాక్ జాబితా వివరాలను పొందడానికి ముందు, బైబ్యాక్‌కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకుందాం. బైబ్యాక్ ద్వారా కార్పోరేట్ వ్యవస్థ, అలాగే ఇన్వెస్టర్లు లాభపడతారు.

బైబ్యాక్ ఎందుకు?
షేర్ల బైబ్యాక్ ద్వారా మార్కెట్‌లో తమ కంపెనీలకు ఉన్న వాటాల సంఖ్యను సాధ్యమైనంత మేర తగ్గించడం. మార్కెట్లో ఇన్వెస్టర్ల చేతిలో కంపెనీ వాటాలు తగ్గించుకోవడానికి ఇండియా ఇంక్ మొదటి నుండి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తుంది. మార్కెట్లో ఫ్లోటెడ్ షేర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా ఇప్పటికే ఉన్న షేర్ల వ్యాల్యూను పెంచుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది. అలాగే లిస్టెడ్ ఎంటిటీలో వాటాదారులను పెంచుకోవడానికి, ఇతర వాటాదారులను తగ్గించడానికి లేదా అనుమతించకుండా ఉండే వ్యూహం ఇది.

షేర్ బైబ్యాక్ లక్ష్యాలు
- అదనపు నగదు పంపిణీ కోసం.
- అండర్ వ్యాల్యుయేషన్ స్టాక్‌కు మద్దతు కోసం.
- ఆస్తుల రాబడి, ఈపీఎస్ వంటి వాటాల సంఖ్య తగ్గింపు, లాభదాయకతను అదే స్థాయిలో నిర్వహించడం వంటి ఆర్థిక నిష్పత్తిని పెంచడం స్టాక్ వ్యాల్యూకు సానుకూలంగా ఉంటుంది.
- క్యాపిటల్ స్ట్రక్చర్ మార్పు
- కంపెనీ టేకోవర్‌ను అడ్డుకోవడానికి.
- కంపెనీ తన ఉద్యోగులకు జారీ చేయడం కోసం ఫ్లోటెడ్ షేర్లను తిరిగి కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
- కంపెనీ షేర్ల బైబ్యాక్ చేపడితే ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా ఉంటుంది.

స్టాక్ పెరగడానికి...
కంపెనీ ప్రస్తుత కార్యకలాపాలు బుల్లిష్‌గా ఉంటే, కంపెనీ ఆదాయాల నిష్పత్తిని మరింత పెంచేందుకు బైబ్యాక్‌తో ముందుకు రావొచ్చు. బైబ్యాక్ స్టాక్ ధర పెరగడానికి దోహదపడుతుంది. షేర్లను కొనుగోలు చేస్తే మార్కెట్లో షేర్ల సంఖ్య తగ్గుతుంది. బైబ్యాక్ కోసం కంపెనీలు ప్రధానంగా రెండు పద్ధతులను అనుసరిస్తాయి. ఇందులో ఒకటి టెండర్ మార్గం, రెండోది ఓపెన్ మార్కెట్ రూట్. ఏదైనా కంపెనీ అప్పు తీసుకోవడం ద్వారా లేదా చేతిలోని నగదుతో లేదా కార్యకలాపాల నుండి వచ్చే నగదుతో బైబ్యాక్ చేపట్టవచ్చు.

త్వరలో వచ్చే బైబ్యాక్స్...
eClerx - టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.3200.
స్టార్ సిమెంట్ - టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.150
బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్ - స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.410. ప్రస్తుతం ఈ ధర రూ.356 వద్ద ఉంది.
టెన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ - స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.1260. ప్రస్తుతం ఈ ధర రూ.891 వద్ద ఉంది.
ఇన్ఫోసిస్ లిమిటెడ్ - స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.1750. ప్రస్తుతం ఈ ధర రూ.1732 వద్ద ఉంది.
నవ్‌నీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ - స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ ధర రూ.100. ప్రస్తుతం ఈ ధర రూ.100.65 వద్ద ఉంది.
స్టాక్ మార్కెట్ లేదా ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అలాగే, బైబ్యాక్ ఆఫర్ కూడా అన్నీ విశ్లేషించి చేయాల్సినది. బైబ్యాక్ చేయాలా లేదా అనే అంశం అన్నీ పరిశీలించి, విశ్లేషించి తీసుకోవాల్సిన నిర్ణయం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications