కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థిక బిల్లులో 39 మార్పులు చేసింది. క్రిప్టో ఆస్తులపై పన్నులను ప్రతిపాదించిన క్రమంలో ఈ విధానాన్ని మరింత కఠినతరం చేయడానికి ఆర్థిక బిల్లులో మార్పులు చేసింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లును ఇటీవల లోకసభలో చర్చకు తీసుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదంపై నిర్ణయం వెలువడింది. క్రిప్టో కరెన్సీల మైనింగ్ సమయంలో జరిగే మౌలిక సదుపాయాల ఖర్చును సముపార్జన ఖర్చుగా పరిగణించవచ్చా? వర్చువల్ డిజిటల్ ఆస్తులను బదలీ చేయడం వల్ల కలిగే నష్టాన్ని ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుండి వచ్చే లాభాలతో భర్తీ చేయవచ్చా? తదితర అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

నష్టాన్ని భర్తీ చేసుకోలేరు
క్రిప్టో కరెన్సీలపై పన్ను తగ్గింపును లేదా ఒక వర్చ్యువల్ కరెన్సీపై వచ్చిన నష్టాన్ని మరో వర్చ్యువల్ కరెన్సీ ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటును కల్పించడం లేదు. ఒక అసెట్స్‌లో వచ్చిన నష్టాలను మరో వర్చువల్ అసెట్స్‌లో వచ్చిన లాభాలతో సెట్-ఆఫ్ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ అన్ని ట్రాన్సుఫర్లను 30 శాతం పన్ను కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లోనే ప్రకటించింది. ఇది మూలధన ఆస్తియా లేక మరొకటా అనే అంశంతో సంబంధం లేకుండా పన్ను విధింపు ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి క్రిప్టో కరెన్సీల ఆదాయాలపై 30 శాతం పన్ను అమల్లోకి వస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పన్ను ఇలా
అధిక క్రిప్టో పన్ను రేటు స్టాక్ ట్రేడింగ్‌ను మరింత లాభదాయకమైన ఎంపికగా మార్చింది. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను కిందకు తీసుకు వస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాస్త షాకింగ్. లాభాలపై 30 శాతం పన్ను అంటే ఉదాహరణకు మీరు రూ.200 ఇన్వెస్ట్ చేస్తే, మీకు మరో రూ.200 లాభం వస్తే మీ చేతికి రూ.400 వస్తుంది. అప్పుడు రూ.200 లాభంపై 30 శాతం పన్ను అంటే రూ.60 వసూలు చేస్తారు. మీ పెట్టుబడిపై ఎలాంటి పన్ను లేదు.

కరెన్సీగా కాదు...
అన్ని క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం టీడీఎస్ ఉంటుంది. అంతర్జాతీయ ఎక్స్చేంజ్‌ల ద్వారా ట్రేడింగ్ నిర్వహించి లాభాలను ప్రభుత్వానికి నివేదించకపోవడం చట్ట విరుద్ధం.
క్రిప్టో నష్టాన్ని మరో వర్చువల్ అసెట్ లాభాల ద్వారా పూడ్చుకోలేరు.
క్రిప్టో పన్ను ద్వారా డిజిటల్ కాయిన్స్‌గా మారే అవకాశముందా అంటే ఆర్బీఐ జారీ చేస్తే మాత్రమే డిజిటల్ కరెన్సీగా గుర్తిస్తారు. ఇతర క్రిప్టోలకు వర్తించదు. మీరు క్రిప్టోలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. కానీ ఉత్పత్తులు కొనుగోలు చేయలేరు.


Click it and Unblock the Notifications