నెల రోజుల్లో 150% రిటర్న్స్ అందించిన క్రిప్టో కరెన్సీ తెలుసా?
టాప్ క్రిప్టో కరెన్సీలు నేడు మిశ్రమంగా కదిలాయి. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ 50వేల డాలర్లకు మరింత సమీపించింది. నేడు 0.02 శాతం లాభపడి 48,471.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం మాత్రం 1.40 శాతం మేర క్షీణించి 3,188.52 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 2.23 శాతం క్షీణించి 0.2903 డాలర్ల వద్ద, XRP 2.40 శాతం క్షీణించి 1.16 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. కార్డానో 0.47 శాతం ఎగబాకి 2.73 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ కొద్ది నెలల క్రితం 65వేల డాలర్లకు సమీపించి, ఇటీవల ఓ సమయంలో 30వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే క్రమంగా లాభపడుతూ, ఇప్పుడు 49,000 డాలర్లను కూడా తాకింది. మిడ్ మే నెల నుండి ఈ దిగ్గజ క్రిప్టో కరెన్సీ మొదటిసారి 50,000 మార్కును దాటింది. అంటే మూడు నెలలకు పైగా ఈ మార్కును అందుకోలేదు. అంటే క్రిప్టో మార్కెట్ క్రమంగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
బిట్ కాయిన్ ఈ ఏడాది 65 శాతం లాభపడింది. అయితే ఏప్రిల్ నాటి ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు దూరంలోనే ఉంది. స్టెల్లార్, యూనిస్వాప్, లైట్ కాయిన్, వంటి క్రిప్టోలు కూడా మిశ్రమంగా కదలాడాయి. క్రిప్టో కరెన్సీ కార్డానో దూసుకెళ్తోంది. నేడు 0.47 శాతం మేర లాభపడింది. బిట్ కాయిన్ కంటే ఎక్కువగా లాభపడింది. గత నెల రోజుల్లో (జూలై 20 నుండి) ఈ క్రిప్టో 150 శాతం రిటర్న్స్‌ను అందించింది. ADA కాయిన్ గత వారం రోజుల్లోనే 50 శాతం రిటర్న్స్ అందించింది.

ఇదిలా ఉండగా, ఫ్రాడ్ చేసినందుకు గాను ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 8 క్రిప్టో కరెన్సీ యాప్స్‌ను బ్యాన్ చేసింది. తమ ఫోన్స్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెబుతూ క్లౌడ్ మైనింగ్ సేవలను ఉపయోగిస్తూ ధనవంతులను ఆకర్షించాలని భావిస్తున్నారు. అయితే వాస్తవానికి వీటిలో స్కాం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఇలా చెప్పిన యాప్స్‌లో ఒక్క దానిలో కూడా క్రిప్టో మైనింగ్ కార్యకలాపాల్లేవు. ఏదేమైనా ఫోన్ వినియోగదారుడు ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాక 14.99 డాలర్ల నుండి 18.99 డాలర్ల వరకు ఛార్జ్ చేస్తారు.


Click it and Unblock the Notifications