క్రిప్టో మైనింగ్‌పై 4 నెలలు ఇరాన్ బ్యాన్, ఈ దేశాల్లో వర్చువల్ కరెన్సీ నిషేధం
క్రిప్టోకరెన్సీ మైనింగ్ పైన ఇరాన్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 22 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఇరాన్ అధ్యక్షులు హసన్ రౌహానీ ప్రకటించారు. పలు నగరాల్లో తరుచు బ్లాక్ ఔట్లు ఏర్పడటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ మైనింగ్‌లో ఇరాన్ వాటా 4.5 శాతం. దీంతో క్రిప్టో మైనింగ్ ద్వారా ఇరాన్ అధిక రెవెన్యూ కోరుతోంది. దేశంలో తరుచూ విద్యుత్ కొరత, కోతలకు బిట్ కాయిన్ మైనర్లు కారణంగా ఇరాన్ చెబుతోంది. జనవరిలో పలు అనియంత్రిత మైనింగ్ సంస్థలను మూసివేసింది. లీగల్ మైనింగ్ 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తోంది.

ఇరాన్‌లో విద్యుత్ వినియోగం
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతోన్న విద్యుత్‌లో సగానికి పైగా ప్రస్తుతం బిట్ కాయిన్ మైనింగ్ కోసం వినియోగిస్తున్నట్లు కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ తెలిపింది.అధిక మొత్తంలో విద్యుత్ వినియోగం పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ డేటా ప్రకారం 76 శాతం సంప్రదాయేతర ఇంధనంతో మైనర్లు బిట్ కాయిన్‌ను తయారు చేశారు. ఇరాన్‌లో 600 మెగావాట్ల విద్యుత్ బిట్‌కాయిన్ మైనింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఇది ఏటా 100 కోట్ల డాలర్ల ఆదాయం అందిస్తోంది.

ఇరాన్, బొలీవియా నిషేధం
క్రిప్టోకరెన్సీని వివిధ దేశాలు బ్యాన్ చేశాయి. క్రిప్టోను ఇల్లీగల్‌గా పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఇరాన్ నాలుగున్నర నెలల పాటు క్రిప్టో మైనింగ్‌ను నిలిపివేసింది. నేర కార్యకలాపాల కారణంతో ఇటీవల బొలీవియా క్రిప్టో వినియోగాన్ని వ్యతిరేకించింది. వర్చువల్ కరెన్సీ ఉపయోగించడాన్ని నేరంగా పేర్కొంది బొలీవియా కేంద్రబ్యాంకు.

ఏకైక యూరోపియన్ దేశం
బిట్ కాయిన్, ఎథేరియం వంటిక్రిప్టోకరెన్సీ ఉపయోగించడాన్ని నిషేధించిన ఏకైక యూరోపియన్ దేశం నార్త్ మెసడోనియా. ఇక్కడ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం చట్టవిరుద్ధం. క్రిప్టో కరెన్సీ అక్రమ కార్యకలాపాలతో ముడివడి ఉందని జాతీయ బ్యాంకులు హెచ్చరించాయి. క్రిప్టో వర్తకం ప్రమాదకరమని సెంట్రల్ బ్యాంకు హెచ్చరించింది. క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌ను నియంత్రించే వేదికలు లేవని తెలిపింది.


Click it and Unblock the Notifications