2030 నాటికి కోటీశ్వరులు కావాలంటే.. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇలా ఉండాలి!
కోటీశ్వరులు కావాలనేది ప్రతి భారతీయుడి కల. ముఖ్యంగా ఉద్యోగులకు లేదా చిన్న వ్యాపారులకు ఇది కష్టమైన లక్ష్యం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. SIP (Systematic Investment Plan) ద్వారా ప్రతి నెలా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల ద్వారా కోటి రూపాయల కలను సాధ్యం చేసుకోవచ్చు. కేవలం ఐదేళ్లలో (2030 నాటికి) రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి మరి!

కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి SIP లు సరైన ఎంపిక. ఎందుకంటే అవి మార్కెట్‌తో అనుసంధానమైన రాబడిని అందిస్తాయి. మీరు ఈ రోజు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించి.. 2030 నాటికి రూ.1 కోటి కార్పస్‌ను నిర్మించాలనుకుంటే.. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
1. సుమారు 8% రిటర్న్స్ అంచనాతో..
• లక్ష్యం చేరుకోవడానికి నెలకు అవసరమైన పెట్టుబడి: రూ.1,36,500
• మొత్తం పెట్టుబడి: రూ.81.9 లక్షలు
• పెట్టుబడిపై అంచనా రాబడి: రూ.18.31 లక్షలు
• మెచ్యూరిటీ కార్పస్: రూ.1 కోటి
2. సుమారు 10% రిటర్న్స్ వస్తే..
• లక్ష్యం చేరుకోవడానికి నెలకు అవసరమైన పెట్టుబడి: రూ.1,30,000
• మొత్తం పెట్టుబడి: రూ.78 లక్షలు
• పెట్టుబడిపై అంచనా రాబడి: రూ.22.32 లక్షలు
• మెచ్యూరిటీ కార్పస్: రూ.1 కోటి
3. సుమారు 12% రిటర్న్స్ వస్తే..
• లక్ష్యం చేరుకోవడానికి నెలకు అవసరమైన పెట్టుబడి: రూ.1,23,500
• మొత్తం పెట్టుబడి: రూ.74.1 లక్షలు
• పెట్టుబడిపై అంచనా రాబడి: రూ.26.06 లక్షలు
• మెచ్యూరిటీ కార్పస్: రూ.1 కోటి
ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- పైన ఉన్న లెక్కల ప్రకారం.. ఐదేళ్లలో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ప్రతి నెలా మీరు కనీసం రూ.1 లక్షకు పైగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. తక్కువ కాలపరిమితి ఉన్నందున ఇది తప్పనిసరి. ఒకవేళ మీ ఫండ్స్ 20 నుంచి 30 శాతం రిటర్న్స్ ఇస్తే.. మీరు తక్కువ మొత్తంతోనే రూ. కోటి సంపాదించొచ్చు.
- స్వల్ప కాలంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ పెట్టుబడిలో ఎక్కువ భాగం మ్యూచువల్ ఫండ్ SIP వంటి హై రిటర్న్స్ ఇచ్చే ఆస్తులలో ఉండాలి.
- ఐదేళ్ల కాలంలో మార్కెట్ అస్థిరత కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, నష్టాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి.
మీ పెట్టుబడి తక్కువగా ఉంటే..
మీరు నెలకు కేవలం రూ.30,000 మాత్రమే పెట్టుబడి పెట్టగలిగితే.. అదే 10%, 12%, 15% రాబడితో కోటీశ్వరులు కావడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించుకోవాలి. ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించడం ద్వారా చక్రవడ్డీ (Compounding) ద్వారాచిన్న మొత్తంతో కూడా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉదాహరణకు 12% రాబడిని సాధిస్తే.. రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి సుమారు 12 నుంచి 13 సంవత్సరాలు పట్టొచ్చు. చిన్న మొత్తంతో కూడా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక కీలకం.


Click it and Unblock the Notifications