క్రెడిట్ కార్డు అనగానే మనలో చాలా మందికి సందేహం ఏమిటంటే ఒకవేళ జీతం రాకపోయినా కూడా మాకు క్రెడిట్ కార్డు ఇస్తారా? అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా యువత స్వయం ఉపాధి వృత్తి వేత్తలు (ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్, ఫోటోగ్రాఫర్లు) ఎక్కువ అయ్యేటప్పటికి బ్యాంకులు కూడా మీకు స్తిరమైన ఉద్యోగం లేకపోయినా, మీకు ఓ స్థిర ఆదాయం (consistent income) ఉంటే, మీకు కూడా క్రెడిట్ కార్డును పొందపరుచుతుంది. ఇప్పుడు బ్యాంకులు కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఆలోచిస్తున్నాయి. మరి అలా ఏ ఏ బ్యాంకులు ఇస్తున్నాయి? ఎలా అప్లై చేయాలి? ఏ డాక్యుమెంట్లు అవసరం? అన్నదంతా ఇక్కడ తెలుసుకుందాము.

ఇలాంటి స్వయం ఉపాధి చేసేవాళ్ళు క్రెడిట్ కార్డు పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరి. ముందుగా, వారికి నిలకడైన ఆదాయం (stable income) ఉండాలి. ఎందుకంటే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇవ్వాలంటే, మీరు అప్పు తీర్చ గల సామర్థ్యం ఉందని నమ్మకం కలగాలి. అలాగే, వ్యాపారం చేసే వారయితే లేదా ఫ్రీలాన్సర్లు అయితే, కనీసం మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్నులు (ITRs)/బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించడం అవసరం. ఇవి మీ ఆదాయ స్థాయిని చాటుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం సిబిల్ స్కోర్ (CIBIL Score) కూడా 700 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇది మీ గత క్రెడిట్ హిస్టరీకి సంబంధించి మీ నమ్మకాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కాకుండా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్ వంటి ప్రాథమిక గుర్తింపు పత్రాలు కూడా తప్పనిసరిగా సమర్పించాలి.
మొదటగా, మీరు దరఖాస్తు చేయాలనుకున్న బ్యాంక్‌లో మీ పేరు మీద ఓ సేవింగ్ ఖాతాని తెరవడం మంచిది. ఎందుకంటే, చాలామంది బ్యాంకులు తమ ఖాతాదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత, మీరు ఆన్‌లైన్‌లో (బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా) లేదా ఆఫ్‌లైన్‌లో (బ్యాంక్ బ్రాంచ్‌లో ప్రత్యక్షంగా) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆదాయ పత్రాలు, గుర్తింపు పత్రాలు, అడ్రెస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. బ్యాంక్ వారు ఈ పత్రాలు, మీ క్రెడిట్ స్కోర్ కూడా పరిశీలించి, వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు. అన్ని వివరాలు సరిగ్గా ఉండి, అర్హతలన్నీ నెరవేరిన తర్వాత, బ్యాంక్ మీకు క్రెడిట్ కార్డు మంజూరు చేస్తుంది.
కొన్ని బ్యాంకులు స్వయం ఉపాధి ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలు కలిగిస్తుంది:
వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ కోసం యాక్సిస్, SBI, HDFC బ్యాంకులు ప్రత్యేక ప్రొఫెషనల్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లు అందిస్తున్నాయి. వీటికి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయి. ICICI, కోటాక్ మహీంద్రా బ్యాంకు కూడా ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక ఖాతాలు, లోన్ స్కీమ్లు, క్రెడిట్ కార్డ్‌లు అందిస్తుంది. వీటికి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు అందిస్తున్నాయి.
స్వతంత్రంగా పని చేసేకునే వ్యక్తులకు (Self-employed individuals) ఇప్పుడు కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డిజిటల్ లోన్లు కూడా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల ద్వారా వీరు సులభంగా రుణాలు పొందగలుగుతున్నారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY), స్టాండ్ అప్ ఇండియా, PMEGP, PM విశ్వకర్మ వంటి పథకాలు కేవలం వ్యాపారులకు మాత్రమే కాకుండా, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ట్యూషన్ టీచర్లు వంటి అనేక వృత్తులకు కూడా వర్తిస్తున్నాయి.
ఇవి కాకుండా, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) ద్వారా ప్రభుత్వం రుణానికి 85% వరకు గ్యారంటీ ఇస్తోంది. కొన్ని రకాల లోన్లపై వడ్డీపై టాక్స్ మినహాయింపులు కూడా లభిస్తాయి, ఇది వారి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications