క్రెడిట్ కార్డులు వాడకం మాములుగా లేదు.. జూన్‌లో రూ. 2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో భారత క్రెడిట్ కార్డ్ పరిశ్రమ నిలకడైన వృద్ధిని ప్రదర్శిస్తూ వరుసగా రెండో నెలలోనూ రూ. 2 ట్రిలియన్ల మార్కును దాటింది. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈసారి మొత్తం క్రెడిట్ కార్డ్ ఖర్చులు 9.8 శాతం మేర పెరిగి రూ. 2.01 లక్షల కోట్లకు చేరాయి. మే నెలలో నమోదైన రూ. 2.02 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఓవరాల్‌గా పరిశ్రమ గణనీయమైన వృద్ధిని కనబరిచింది. దేశీయ క్రెడిట్ కార్డ్ రంగానికి ఈ నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్‌లు ముందు వరసలో నిలిచాయి.

బ్యాంకుల వారీగా వ్యయాలను పరిశీలిస్తే.. దేశంలోనే అతిపెద్ద Credit Card జారీదారు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన 16.2 శాతం వృద్ధితో రూ. 59,432 కోట్ల ఖర్చులను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌బిఐ కార్డ్స్ ఏకంగా 34.4 శాతం విపరీతమైన వృద్ధిని సాధించి తన కార్డ్ వ్యయాన్ని రూ. 41,077 కోట్లకు చేర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా 1.4 శాతం స్వల్ప వృద్ధితో రూ. 22,174.8 కోట్ల వ్యయాన్ని నమోదు చేసింది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ విషయంలో కార్డ్ వ్యయం గత ఏడాదితో పోలిస్తే 5.2 శాతం తగ్గి రూ. 31,410.9 కోట్లకు పడిపోవడం గమనార్హం.

Credit Card Spending Credit Card Transactions 2 Trillion India Economy Consumer Spending Digital Payments Banking News Retail Spending Finance News Business News Credit Card Spending 2 India Economy Credit Card Transactions

కేర్‌ఏజ్ రేటింగ్స్ డైరెక్టర్ సౌరభ్ భల్‌రావ్ విశ్లేషణ ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం ఏడాది ప్రాతిపదికన కేవలం 6 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమవ్వగా, ఇతర ప్రైవేట్ బ్యాంకులు 4 శాతం క్షీణతను నమోదు చేశాయి. మొత్తం పరిశ్రమ సాధించిన 10 శాతం వార్షిక వృద్ధిలో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSU Banks) నుంచే వచ్చింది. అసురక్షిత రుణాలు (Unsecured Loans) పెరిగిపోవడం, రుణ గ్రహీతల నాణ్యత (Asset Quality) పై ఆందోళనలు ఉండటంతో పెద్ద ప్రైవేట్ బ్యాంకులు కార్డుల జారీ, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Also Read

మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూపే (RuPay) క్రెడిట్ కార్డులను యూపీఐ (UPI) తో అనుసంధానించే విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఇది PSU బ్యాంకుల కస్టమర్ పరిధిని పెంచడమే కాకుండా.. విరివిగా క్రెడిట్ కార్డులను ఉపయోగించేలా మార్గం సుగమం చేసింది.

మరోవైపు బ్యాంకింగ్ రంగం మొత్తంలో క్రెడిట్ కార్డుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నెలవారీగా 0.95 శాతం, వార్షికంగా 9.36 శాతం ఎదుగుదలతో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 121.6 మిలియన్లకు (12.16 కోట్లు) చేరుకుంది. నూతన కార్డుల జారీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జూన్ నెలలో అత్యధికంగా 1,63,511 కార్డులను చేర్చి తన మొత్తం కార్డుల సంఖ్యను 26.75 మిలియన్లకు పెంచుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఎస్‌బిఐ కార్డ్స్ కొత్తగా 1,62,664 కార్డులను చేర్చి మొత్తం 22.5 మిలియన్లకు, ఐసిఐసిఐ బ్యాంక్ 1,51,352 కార్డులను జోడించి 19.52 మిలియన్లకు, యాక్సిస్ బ్యాంక్ 48,636 నూతన కార్డులను చేర్చుకుని తన మొత్తం సంఖ్యను 16.19 మిలియన్లకు చేర్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+