నో-కాస్ట్ EMI నిజంగానే ఉచితమా? క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఈ హిడెన్ ఛార్జీలను గమనించండి!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్ (credit card) ఈఎంఐ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా, చిన్న చిన్న నెలవారీ వాయిదాలలో డబ్బులు కట్టుకునే సదుపాయం ఉండటంతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్స్ రంగాలలో ఈఎంఐల వాడకం విపరీతంగా పెరిగింది.

ముఖ్యంగా, "నో-కాస్ట్ ఈఎంఐ" (No-Cost EMI) ఆఫర్లు వినియోగదారులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఎలాంటి అదనపు వడ్డీ ఉండదని బ్యాంకులు మరియు ఈ-కామర్స్ సైట్లు ప్రకటిస్తుంటాయి. అయితే, పైకి వడ్డీ లేనట్టు కనిపించినా.. దీని వెనుక ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ, మరికొన్ని హిడెన్ ఛార్జీలు దాగి ఉంటాయి. ఇవి మీ కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా పెంచేస్తాయి.

Credit card no cost EMI hidden charges processing fees GST credit card

దేశంలో ఎగబాకుతున్న క్రెడిట్ కార్డ్ ఖర్చులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ప్రకారం, దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత 2025 లో, క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగిన నెలవారీ ఖర్చులు ఏకంగా ₹2 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడం ఒక రకంగా మంచిదే అయినప్పటికీ, సులభమైన ఈఎంఐ ఆప్షన్ల వల్ల ప్రజలు తమ బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నో-కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? బ్యాంకుల అసలు ట్రిక్ ఇదే!

వడ్డీ లేని ఈఎంఐ అనేది ఒక వ్యాపార వ్యూహం మాత్రమే. కంపెనీలు ఈ ఆఫర్లను ప్రధానంగా రెండు మార్గాల్లో అందిస్తాయి..

  • డిస్కౌంట్‌ను తగ్గించడం: వస్తువుపై ఇవ్వాల్సిన అసలు డిస్కౌంట్‌ను తగ్గించి, ఆ మొత్తాన్ని వడ్డీ కింద బ్యాంకుకు సర్దుబాటు చేస్తాయి.
  • ధరలో వడ్డీని కలపడం: వస్తువు అసలు ధరలోనే వడ్డీ మొత్తాన్ని ముందే కలిపి, ఆపై నో-కాస్ట్ ఈఎంఐగా చూపిస్తాయి.

అంటే వినియోగదారులు వడ్డీ లేని కొనుగోలు చేస్తున్నామని సంబరపడతారే కానీ, పరోక్షంగా ఆ అదనపు మొత్తాన్ని ముందే చెల్లించేస్తుంటారు.

మీరు ఖచ్చితంగా గమనించాల్సిన 4 హిడెన్ ఛార్జీలు

  • ప్రాసెసింగ్ ఫీజు (Processing Fees): మీరు నో-కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నా సరే, చాలా బ్యాంకులు ఈఎంఐ ప్రక్రియను ప్రారంభించడానికి వన్-టైమ్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఇది మీ బిల్లును పెంచుతుంది.
  • వడ్డీ ఛార్జీలు (Interest Charges): సాధారణ ఈఎంఐ ప్లాన్లలో అయితే, మీరు చెల్లించాల్సిన బకాయి మొత్తంపై బ్యాంకులు నేరుగా వడ్డీని విధిస్తాయి. దీనివల్ల ప్రొడక్ట్ అసలు ధర కంటే చివరికి మీరు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
  • ఫోర్‌క్లోజర్ ఛార్జీలు (Foreclosure Charges): ఈఎంఐ గడువు ముగియక ముందే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మొత్తం అప్పును ఒకేసారి తీర్చేయాలని (Pre-closure) అనుకుంటే.. బ్యాంకులు దీనిపై నిర్దిష్ట శాతం పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలను బాదుతాయి.
  • జీఎస్టీ (GST) ప్రభావం: బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ , ఫోర్‌క్లోజర్ ఛార్జీలపై అదనంగా 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది మీ జేబుకు మరింత చిల్లు పెడుతుంది.

ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే ముందు ఏం చేయాలి?

  • ధరలను పోల్చి చూడండి: ఒక వస్తువును ఈఎంఐలో కొనే ముందు, వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో దాని క్యాష్ డిస్కౌంట్ ధర ఎంత ఉందో చెక్ చేయండి. కొన్నిసార్లు ఒకేసారి డబ్బులు కట్టి కొంటేనే ఎక్కువ లాభం ఉండవచ్చు.
  • టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి: ఈఎంఐ అంగీకరించే ముందు ప్రాసెసింగ్ ఫీజు ఎంత, వడ్డీ రేటు ఎంత, ఒకవేళ ముందే కట్టేస్తే ఛార్జీలు ఎంత ఉంటాయో స్పష్టంగా తెలుసుకోండి.

మొత్తం ఖర్చును లెక్కించండి..

ఈ ఫార్ములా ప్రకారం ప్రొడక్ట్ అసలు ధర కంటే ఎంత ఎక్కువ అవుతుందో ముందే లెక్కించుకోండి.
మీ నెలవారీ ఆదాయం , బడ్జెట్‌కు అనుగుణంగా ఈఎంఐ వాయిదాలు ఉంటేనే ఆ ఆప్షన్‌ను ఎంచుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+