For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా పాలసీల రెన్యూవల్‌పై రెగ్యులేటర్ కొత్త ఆదేశాలు.. ఇవే

|

కరోనా కవచ్, కరోనా రక్షక్ పేర్లతో వినియోగదారులకు జారీ చేసిన కరోనా ప్రత్యేక ఆరోగ్య పాలసీల పునరుద్ధరణ సమయంలో పదిహేను రోజుల నిరీక్షణ కాలాన్ని మరోసారి విధించకూడదని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI సూచించింది. కొత్తగా పాలసీలు తీసుకున్న తర్వాత 15 రోజుల వరకు నిరీక్షణ కాలం ఉంటుంది. పదహారవ రోజు నుండి పాలసీ అమలవుతుంది. అయితే పునరుద్ధరణ సమయంలో మాత్రం ఈ నిరీక్షణ ఉండవద్దని తెలిపింది. ఇందుకు పాలసీ గడువు ముగియకముందే పాలసీదారులు తమ పాలసీలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్

వీటికి కూడా బీమా కంపెనీలకు అనుమతి

వీటికి కూడా బీమా కంపెనీలకు అనుమతి

స్వల్పకాలిక కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ పాలసీలను బీమా కంపెనీలు మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో విక్రయిస్తున్నాయి. కరోనా మహమ్మారి చికిత్సకు అయ్యే ఖర్చు ఆధారంగా వీటిని రూపొందించారు. కరోనా కవచ్, కరోనా రక్షకమ పాలసీలతో పాటు గ్రూప్ కరోనా కవచ్ పాలసీల కోసం రెన్యువల్, మైగ్రేషన్, పోర్టబులిటీ అనుమతికి బీమా సంస్థలకు కూడా అవకాశం ఉంది. ఈ మేరకు IRDAI స్పష్టం చేసింది.

మార్చి 31 వరకు పునరుద్ధరణ

మార్చి 31 వరకు పునరుద్ధరణ

కరోనా సంబంధ పాలసీలను మార్చి 31వ తేదీ వరకు పునరుద్ధరించవచ్చు. అయితే కవరేజీ సజావుగా సాగేందుకు ప్రస్తుత కాంట్రాక్ట్ గడువు ముగిసేలోగా పునరుద్ధరించాలి. పునరుద్ధరణ కోసం 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండవద్దని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ సూచించింది. పునరుద్ధరణ సమయంలో పాలసీదారు బీమా మొత్తాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే దీని కోసమే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

పాలసీదారు కోరుకుంటే కరోనా కవచ్ వ్యక్తిగత పాలసీలను ఇతర నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా ఉత్పత్తికి మార్చుకోవచ్చునని IRDAI తెలిపింది.

అయితే కరోనా కవచ్ గ్రూప్ పాలసీల విషయానికి వస్తే బీమా సంస్థలకు వెసులుబాటు ఉంది.

బీమా మొత్తం పెంచుకోవచ్చు

బీమా మొత్తం పెంచుకోవచ్చు

కరోనా కవచ్ (వ్యక్తిగత) పాలసీని ఒక బీమా సంస్థ నుండి మరో సంస్థకు మార్చుకోవడానికి సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు అనుమతి ఉందని రెగ్యులేటర్ తెలిపింది. ప్రస్తుతం కరోనా కవచ్, కరోనా రక్షక్‌లకు డిమాండ్ పెరిగింది. ఇవి ప్రారంభించిన కొద్ది నెలల్లోనే జూలై 10 నాటికి 7.5 లక్షల కరోనా కవచ్ పాలసీల విక్రయం జరిగింది. 12.86 లక్షల మంది, రూ.215 కోట్ల ప్రీమియం వచ్చింది. ప్రారంభంలో ఎక్కువ మొత్తంతో బీమా చేయలేకపోయిన వారు ఇప్పుడు చికిత్స పెరుగుతుందని భావిస్తే బీమా మొత్తాన్ని పెంచుకోవచ్చు.

English summary

కరోనా పాలసీల రెన్యూవల్‌పై రెగ్యులేటర్ కొత్త ఆదేశాలు.. ఇవే | COVID 19 specific health policies to get longer run

Insurance regulator IRDAI has allowed renewal, migration and portability of standard COVID-19 specific health policies Corona Kavach and Corona Rakshak.
Story first published: Wednesday, October 14, 2020, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X