గత ఏడాది కాలంలో గృహ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగటున పది శాతం నుండి పన్నెండు శాతం పెరిగిందని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. వచ్చే డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం మరో ఎనిమిది శాతం నుండి తొమ్మిది శాతం మేర పెరగవచ్చునని అంచనా వేస్తోంది. నిర్మాణంలో ఎక్కువగా వినియోగించే సిమెంట్, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలు సప్లై చైన్ ఇబ్బందుల నేపథ్యంలో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022 మార్చి నాటికి 20 శాతానికి పైగా పెరిగాయి. ధరలు మరింత పెరుగుతున్నందున, హౌస్ డెవలపర్లు ధరల వ్యూహాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

ఇలా లెక్కిస్తారు..
ఇంటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చును లెక్కించడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు బిల్టప్ ఏరియాను స్క్వేర్ ఫీట్‌కు అయ్యే ఖర్చుతో గుణిస్తే మొత్తం ఖర్చును అంచనా వేయవచ్చు. ఒక ఇంటి నిర్మాణం కోసం అత్యధికంగా అయ్యే ఖర్చు వరుసగా స్టీల్, ఫిట్టింగ్ (విండో, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, డోర్లు), సిమెంట్, ఫినిషర్, ఇసుక, అగ్రిగేట్ ఉంటాయి.

వీరికి భారం
నిర్మాణ వ్యయాలు ఇటీవల భారీగా పెరిగాయి. ఇందు అఫోర్డబుల్ ఇళ్ల ధరలు, మధ్య తరహా ఇళ్ల ధరల విభాగాలపై ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. ఈ విభాగంలో తక్కువ మార్జిన్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కారణంగా తెలిపింది. మొత్తం నిర్మాణ వ్యయంలో నిర్మాణ సామాగ్రి వాటా 2/3 వంతు వాటా ఉంటుంది. వీటి ధరలకు అనుగుణంగా డెవలపర్లు ఇల్లు లేదా ప్లాట్ ధరలను నిర్ణయిస్తారు.
హోల్ సేల్ ధరల ద్రవ్యోల్భణం, నిర్మాణ వ్యయాలు రెండూ డబుల్ డిజిట్ స్థాయికి చేరుకోవడంతో 2022 డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం దాదాపు మరో తొమ్మిది శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు.

సిమెంట్ 20 శాతం జంప్
గత ఏడాది మార్చి నెలలో చదరపు అడుగుకు సగటున రూ.2060 ఉండగా, ఈ మార్చి నాటికి ఇది రూ.2300కు పెరిగింది. నిర్మాణ వ్యయం గణాంకాల్లో జీఎస్టీ లేదు కాబట్టి, దీనిని కలుపుకుంటే ఖర్చు పెరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎక్స్‌పెన్సెస్ రూ.1900 నుండి రూ.2100కు పెరిగాయి. సిమెంట్, స్టీల్ వంటి మెటిరీయిల్స్ ధరలు ఇటీవలి కాలంలో దాదాపు 20 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications